నిర్మల్‌చైన్‌గేట్: పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని, సాంకేతిక విద్యా వ్యవస్థలో పాలిటెక్నిక్‌ను కొనసాగిస్తూ ఎస్‌బీటీఈటీ స్వతంత్రతను పరిరక్షించాలని విద్యార్థులు గురువారం నిర్మల్‌లో ధర్నా చేపట్టారు. బీజేపీ శాసనసభాపక్ష నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి విద్యార్థుల డిమాండ్లకు పూర్తి మద్దతు తెలిపారు. విద్యార్థుల ప్రయోజనాల రక్షణకు స్పష్టమైన చర్యలు తీసుకోవాలని పే ర్కొన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు రావుల రామనాథ్, దొడ్డికింది ముత్యంరెడ్డి, జమాల్, సత్యం చంద్రకాంత్, సుంకరి సాయి, పలువురు కౌన్సిలర్లు, నాయకులు విద్యార్థులు పాల్గొన్నారు.


