నిమజ్జన మార్గంలో మృత్యుపాశాలు | - | Sakshi
Sakshi News home page

నిమజ్జన మార్గంలో మృత్యుపాశాలు

Sep 25 2026 2:05 AM | Updated on Sep 25 2026 2:05 AM

● నిర్మల్‌ పట్టణంలో అస్తవ్యస్తంగా విద్యుత్‌ తీగలు ● ప్రమాదకరంగా ట్రాన్స్‌ఫార్మర్లు

నిర్మల్‌టౌన్‌: నిర్మల్‌ పట్టణంలోని అనేక ప్రాంతాల్లో విద్యుత్‌ తీగలు, ఇంటర్నెట్‌ వైర్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి. విద్యుత్‌ స్తంభాలపై ఒకదాంట్లో ఒకటి చిక్కుకున్న తీగలు కనిపిస్తున్నాయి. కొన్నిచోట్ల ఒకే స్తంభానికి పదుల సంఖ్యలో కేబుల్‌ వైర్లు అమర్చడంతో ఏది విద్యుత్‌ వైరో, ఏది కేబుల్‌ వైరో గుర్తించలేని పరిస్థితి నెలకొంది. మరికొన్ని ప్రాంతాల్లో వైర్లు కిందికి వేలాడుతుండగా, స్తంభాలకు తీగజాతి మొక్కలు అల్లుకుపోయాయి. పాదచారులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని చోట్ల ట్రాన్స్‌ఫార్మర్లు కూడా ప్రమాదకరంగా కనిపించడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నిమజ్జన మార్గంలో..

వినాయక నిమజ్జన శోభాయాత్ర శుక్రవారం ప్రా రంభమవుతుంది. అయినా పట్టణంలో కొన్ని చోట్ల వైర్ల పరిస్థితి మారకపోవడంతో నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు. బుధవార్‌పేట్‌, నాగ్రేశ్వరవాడ, నిషాత్‌, ధ్యాగవాడ, సోమవార్‌పేట్‌, గాంధీచౌక్‌, నాయుడువాడ, బంగల్‌పేట్‌ మీదుగా గణప తి విగ్రహాలు, అలంకరించిన రథాలు వెళ్లనున్నా యి. ఈ మార్గంలో కొన్ని చోట్ల విద్యుత్‌, కేబుల్‌ వైర్లు తక్కువ ఎత్తులో ఉండటంతో భారీ విగ్రహా లు, రథాలు వెళ్లే సమయంలో వాటికి తగిలే అవకా శం ఉంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో విద్యుత్‌ అధి కారులు తీగలను సరిచేసినప్పటికీ, మిగతా చోట్ల కూడా పూర్తిస్థాయిలో పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని నిర్వాహకులు కోరుతున్నారు. నిమజ్జనం రోజున ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

వర్షంతో ముప్పు..

విద్యుత్‌ తీగల చుట్టూ చెట్ల కొమ్మలు, తీగలు పెరగ డం, కేబుల్‌ వైర్లు అడ్డదిడ్డంగా ఉండటంతో వర్షం కురిసే సమయంలో ప్రమాదం మరింత పెరిగే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు. వర్షానికి చె ట్ల కొమ్మలు విరిగి విద్యుత్‌ తీగలపై పడటం, వైర్లు ఒకదానికొకటి తగిలే పరిస్థితులు ఏర్పడవచ్చని అంటున్నారు. ముఖ్యంగా రద్దీ ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొంటున్నారు. ప్రమాదకరంగా ఉన్న ట్రాన్స్‌ఫార్మర్లు, వేలాడుతున్న విద్యుత్‌ తీగలను వెంటనే సరిచేయాలని కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement