నిర్మల్‌చైన్‌గేట్: జిల్లాలోని మా తాశిశు ఆస్పత్రిలో ఏసీలకు వై ద్యాధికారులు, ఆస్పత్రి యాజ మాన్యం గురువారం మరమ్మతులు చేయించింది. ‘శిశువుల భద్రత గాలికి’ శీర్షికన ‘సాక్షి’లో గురువారం ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. ఎస్‌ఎన్‌సీయూ, ఇతర వార్డుల్లో ఏసీలు పనిచేయక నవజాత శిశువులు, బాలింతలు పడుతున్న అవస్థలను ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. దీంతో జిల్లా జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ వివిధ విభాగాలను తనిఖీ చేశారు. స్వయంగా శిశువుల వార్డులు, ఐసీయూ విభాగాలను సందర్శించారు. పనిచేయని ఏసీలు, ఇతర వసతులను పరిశీలించారు. ఏసీలు చెడిపోవడానికి కా రణాలను సాంకేతిక సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. వెంటనే ఎలకి్ట్రకల్, టెక్నికల్ టీమ్‌ను రంగంలోకి దించి మరమ్మతులు ప్రారంభించారు. ఆస్పత్రిలో రోగులకు, ముఖ్యంగా చిన్న పిల్లలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ని రంతరం వసతులను పర్యవేక్షించాలని సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
స్పందన


