నిర్మల్‌టౌన్: గణేశ్ నిమజ్జన శోభాయాత్ర కోసం నిర్మల్ పోలీస్ శాఖ సమగ్ర భద్రతా చర్యలు చేపట్టింది. శుక్రవారం జరగనున్న నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా నిర్వహించేందుకుఎస్పీ జానకీషర్మిల ఆధ్వర్యంలో సుమారు 700 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నా రు. భద్రతా విధుల్లో ఒక అదనపు ఎస్పీ, ఒక ఏఎస్పీ, 15 మంది డీఎస్పీలు, సుమారు 50 మంది సీఐలు, ఎస్సైలు, ఇతర సిబ్బంది పా ల్గొంటారు. శోభాయాత్ర మార్గాన్ని 8 సెక్టార్లుగా విభజించి ప్రతీ సెక్టార్‌కు ప్రత్యేక పోలీస్ బలగా లను నియమించారు. అవసరమైన ప్రాంతాల్లో లిఫ్టింగ్, పుషింగ్ పార్టీలను కూడా అందుబాటులో ఉంచుతున్నారు. ప్రధాన మసీదులు, సున్ని త ప్రాంతాలు, రూఫ్‌టాప్‌లు, ట్రాఫిక్ పాయింట్లు, నిమజ్జన ప్రదేశాల వద్ద ప్రత్యేక భద్రతా చ ర్యలు చేపట్టారు. పట్టణంలోని కీలక ప్రాంతా ల్లో 106 సీసీ కెమెరాలతోపాటు నాలుగు డ్రోన్ల ద్వారా నిరంతర నిఘా కొనసాగించనున్నారు.
ట్రాఫిక్ ఆంక్షలు
నిమజ్జన శోభాయాత్ర నేపథ్యంలో పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణకు పోలీసులు ప్రత్యే క చర్యలు చేపట్టారు. నాగరేశ్వరవాడ నుంచి బంగాల్‌పేట్ వరకు శోభాయాత్ర మార్గంలో వాహనాలు పార్కింగ్ చేయవద్దని సూచించారు. మయూరి హోటల్ పరిసరాల్లో శోభాయాత్రను వీక్షించేందుకు వచ్చేవారు తమ వాహనాలు ఎన్‌టీఆర్ స్టేడియం సమీపంలోని కేటాయించిన పార్కింగ్ ప్రాంతాల్లో నిలపాలని సూచించారు.
పోలీసుల ఫ్లాగ్ మార్చ్
నిమజ్జన శోభాయాత్ర నేపథ్యంలో ప్రజల్లో భద్రతా భరోసా కల్పించేందుకు ఎస్పీ జానకీషర్మిల ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం జిల్లా కేంద్రంలో పోలీస్ సిబ్బంది ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. బుధవార్‌పేట్‌లోని ఎంకె.ఫంక్షన్ హాల్ నుంచి ప్రారంభమైన మార్చ్ జామా మసీదు, గుల్జార్ మసీదు, చింతకుంటవాడ, గాంధీచౌక్, కబూతర్‌ఖానా మీదుగా సాగింది. అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ప్రజ లు పోలీసు ల సూచనలు, నిబంధనలు పాటించాలని ఎస్పీ కోరారు. గణేశ్ మండపాల నిర్వాహకులు, యువత పోలీస్ శాఖకు సహకరించి నిమజ్జనం ప్రశాంతంగా నిర్వహించాలని సూ చించారు. ఫ్లాగ్‌మార్చ్‌లో డీఎస్పీ శ్రీనివాస్, సీఐలు, ఎస్సైలు, పోలీసులు పాల్గొన్నారు.


