గత యాసంగి వడ్లకు టెండర్ పిలుపు మంచిర్యాల, నిర్మల్ జిల్లాలకు మూడు లాట్లు 2.26లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యపు నిల్వలు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: గత యాసంగి సేకరించిన(2025–26రబీ) ధాన్యాన్ని వేలం వేయనున్నా రు. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది. మంచిర్యాల, నిర్మల్ జిల్లాల పరిధిలో ఉన్న దొడ్డు రకం ధాన్యాన్ని లాట్‌ల కింద చేర్చి టెండర్ పిలిచింది. ఈ నెల 28న టెండర్ ఓపె న్ చేయనున్నారు. రెండు జిల్లాల పరిధిలో ఉన్న రైస్ మిల్లులతోపాటు గోదాంల్లో నిల్వ చేసిన వడ్లను సై తం వేలంలో చేర్చారు. రెండు జిల్లాలో మొత్తం ధా న్యాన్ని మూడు లాట్లుగా నిర్మల్, మంచిర్యాలతోపాటు మరో లాట్‌లో సిరిసిల్ల పరిధిలోని వడ్లకు కూడా టెండరు పిలిచారు. మంచిర్యాల జిల్లాలో 26, నిర్మల్ జిల్లాలో 30 మిల్లులను మొత్తం గోదాంల్లో ఉన్న వడ్లను కలిపి మూడు లాట్లుగా విభజించా రు. ఒక లాట్‌లో సిరిసిల్ల జిల్లా ధాన్యం చేర్చారు. ఒక్కో లాట్‌కు 50 వేల మెట్రిక్ టన్నుల చొప్పున మొత్తం 150 మెట్రిక్ టన్నులకు వేలం వేయనున్నా రు. పౌరసరఫరాల శాఖ కనీస ధర క్వింటాల్‌కు రూ.2,389 చొప్పున రిజర్వు చేశారు. బిడ్డర్లు ఇంతకంటే తక్కువకు కోట్ చేయరాదు. అర్హులు వేలంలో పాల్గొని ధాన్యాన్ని దక్కించుకోవచ్చు. ఈ మేరకు టెండరు నిర్వహణ మూడు ఏజెన్సీలకు అప్పగించారు. అయితే ధర విషయంలో బిడ్డర్లు ముందుకు వస్తారా? లేదా? అనేది తేలనుంది.
కొనసాగుతున్న తనిఖీలు
మరోవైపు సీఎంఆర్ ఇస్తున్న మిల్లుల్లో పీవీ(ఫిజికల్ వెరిఫికేషన్) జరుగుతోంది. ప్రతీ బుధవారం ఈ మేరకు ధాన్యం నిల్వలపై పరిశీలనలు జరుగుతున్నాయి. గతంలో వలే కాకుండా పకడ్బందీగా పరిశీలనలు చేస్తున్నారు. రెవెన్యూ అధికారులతోపాటు సివిల్ సప్లయి అధికారులు పాల్గొంటున్నారు. దీంతో మిల్లర్లు తమ బియ్యం బాకీలను అప్పగించడంతోపాటు పౌరసరఫరాల శాఖకు బాకీ ఉన్న మొత్తాన్ని చెల్లిస్తున్నారు.
మిల్లర్లకు బదులు వేలమే
పౌరసరఫరాల శాఖ రైతుల నుంచి కనీస మ ద్దతు ధరతో వడ్లను కొనుగోలు చేస్తూ మిల్ల ర్లకు లెవీ(కస్టం మిల్లింగ్ రైస్) కింద ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు నిర్ణీత గడువులోపు ఫుడ్‌కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎఫ్‌సీ ఐ), రాష్ట్ర పరిధిలో పౌరసరఫరాల శాఖ బఫ ర్ గోదాంలకు మిల్లర్లు బియ్యంగా అందించా లి. అయితే ప్రభుత్వం సన్న బియ్యం ఇస్తున్న తరుణంలో దొడ్డు రకాన్ని వేలం వేస్తోంది. అంతేకాక రాష్ట్రంలో గత యాసంగిలో దండిగా ధాన్యం దిగుబడి వచ్చింది. దీంతో కార్పొరేషన్‌కు పెద్ద మొత్తంలో ఆదాయం సమకూరే అవకాశం ఉండడంతో వేలం నిర్వహిస్తోంది. అయితే పెద్ద మొత్తంలో లాట్‌లు ఉండడంతో మిల ్లర్లు ధాన్యం వేలంలో పాల్గొంటారా? లేదా? అనేది వేచి చూడాలి.
మంచిర్యాల జిల్లా
గోదాంలలో 117003 మెట్రిక్ టన్నులు
రా మిల్లుల్లో 4439.286 మెట్రిక్ టన్నులు
మొత్తం 1,21,442 మెట్రిక్ టన్నులు
నిర్మల్ జిల్లా
గోదాంలలో 14704.160 మెట్రిక్ టన్నులు
రా మిల్లుల్లో 89931.809 మెట్రిక్ టన్నులు
మొత్తం 1,04,635.969 మెట్రిక్ టన్నులు


