‘స్వర్ణ’ సర్వేను పరిశీలించిన ఆర్డీవో | - | Sakshi
Sakshi News home page

‘స్వర్ణ’ సర్వేను పరిశీలించిన ఆర్డీవో

Sep 24 2026 12:00 AM | Updated on Sep 24 2026 12:00 AM

సారంగపూర్‌: మండలంలోని స్వర్ణ ప్రాజెక్టు భూముల ఆక్రమణల గర్తింపునకు నిర్వహిస్తున్న సర్వే వరుసగా రెండో రోజు బుధవారం కొనసాగింది. కలెక్టర్‌ ఆదేశాల మేరకు మంగళవారం సర్వే ప్రారంభించారు. మండలంలోని పొట్యా గ్రామ శివారు ప్రాంతంలో జరుగుతున్న సర్వేను తహశీల్దార్‌ విజయ్‌కాంత్‌రావు, ఎంపీడీవో లక్ష్మీకాంత్‌రావుతో కలిసి ఆర్డీవో దేవీదాస్‌ బుధవారం పరిశీలించారు. సర్వే బృందం సభ్యులు ఎంసీలు యోహాన్‌, నరేందర్‌ కు పలు సూచనలు చేశారు. సర్వే పూర్తి కాగానే హద్దులను గుర్తించడంతోపాటు హద్దుల వద్ద పిల్లర్లు ఏర్పాటు చేయించి శాశ్వతంగా ప్రాజెక్టు భూముల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. అలాగే శిఖం భూముల సర్వే పూర్తి కాగానే ప్రాజెక్టు ఆనకట్టకింద గల వ్యవసాయ భూములు, గ్రామ సమీపంలోని అధికారులు, సిబ్బంది క్వార్టర్లు, గ్రామపంచాయతీ నిర్మించిన మడిగెల స్థలాలను సర్వే చేయాలన్నారు. ప్రాజెక్టు భూములు తేలితే కలెక్టర్‌కు నివేదించాలని తహశీల్దార్‌కు సూచించారు. ఆర్డీవో వెంట ఎంఆర్‌ఐ నర్సయ్య, జీపీవో రమాదేవి, పంచాయతీ కార్యదర్శి ప్రేమలత, సర్వే బృందం సభ్యులు పాల్గొన్నారు.

అరిటాకులో భోజనం..

ప్లాస్టిక్‌కు దూరం

ఖానాపూర్‌: పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఖానాపూర్‌ మండలం ఎగ్బాల్పూర్‌ గ్రామంలో శివసేన యూత్‌ ఆధ్వర్యంలో బుధవారం వినా యక మండపం వద్ద వినూత్న కార్యక్రమం నిర్వహించారు. వినాయకుడికి ప్రత్యేక పూజ లు చేసిన అనంతరం గ్రామస్తులకు అరిటాకుల్లో భోజనం వడ్డించారు. ప్లాస్టిక్‌ ప్లేట్లను పూర్తి గా నిషేధించి పర్యావరణ హితాన్ని చాటారు. ఎంపీడీవో రాధరాథోడ్‌ హాజరై యువకులను అభినందించారు. అనంతరం శివసేన యూత్‌ కు వాలీబాల్‌ కిట్‌, నెట్‌ బహూకరించారు. సర్పంచ్‌ రెడ్డి లక్ష్మీనరేందర్‌, ఉపసర్పంచ్‌ గుగ్లావత్‌ రమేశ్‌, పంచాయతీ కార్యదర్శి ముత్యంరెడ్డి, మహిళలు పాల్గొన్నారు.

అరిటాకుల్లో భోజనం చేస్తున్న భక్తులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement