తానూరు : మండల కేంద్రంలోని హంగిర్గా సోసైటీ కార్యాలయంలో డీఏపీ ఎరువులు అందుబాటులో ఉన్నట్లు సమాచారం అందుకున్న రైతులు సోమవారం ఉదయం 6 గంటల నుంచే కార్యాలయానికి చేరుకుని బారులు తీరారు. మొత్తం 400 బాస్తాలు రావడంతో సూమారు 200 మంది క్యూలో నిలబడ్డారు. ఒక ఆధార్ కార్డుకు 5 బ్యాగులు అందించారు. దీంతో 80 మందికి మాత్రమే ఎరువులు అందాయి. 120 మంది నిరశగా వెనుదిరిగారు. చాలామంది రైతులు ఇప్పటికీ ఆన్‌లైన్ బుకింగ్ చేసుకోవడం లేదు. కొంత మందికి ఆన్‌లైన్ చేయడం తెలియక నేటికి ఎరువులు పొందలేదు. అధికారులు ఎరువులను ఆఫ్‌లైన్‌లో అందించేలా చూడాలని కోరుతున్నారు.


