సారంగపూర్: మండలంలోని స్వర్ణ గ్రామంలో ఉన్న లక్ష్మీనర్సింహా రైస్‌మిల్లుపై విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు సోమవారం దాడులు నిర్వహించా రు. రైస్‌మిల్లుకు చేరుకున్న అధికారులు దానికి తాళాలు వేసి ఉండడంతో యజమానిని ఫోన్‌లో సంప్రదించేందుకు ప్రయత్నించారు. ఫోన్ స్విచ్‌ఆఫ్ రావడంతో తాళాలు పగులగొట్టి దాడులు చేపట్టారు. కరీంనగర్ విజిలెన్స్ టీమ్‌తోపాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఇప్పటి వరకు రైస్‌మి ల్లుకు కేటాయించిన ధాన్యం, ప్రభుత్వానికి అందజేసిన సీఎంఆర్ బియ్యంన వివరాలు సరిచూసినట్లు తెలిసింది. రైస్‌మిల్లు యజమాని అందుబాటులో లేకపోవడంతోపాటు ఆయన మొబైల్‌ఫోన్ స్విచ్‌ఆఫ్ చేసి ఉండడంతో అధికారులు వివరాలు ఏమీ వెల్లడించలేదు. వారు గుర్తించిన విషయాలను, తని ఖీ చేసిన వివరాలతో తయారు చేసిన రిపోర్ట్‌ను అదనపు కలెక్టర్‌కు అందజేసినట్లు సమాచారం. మంగళవారం దాడులు కొనసాగించే అవకాశం ఉందని సమాచారం. తనిఖీల్లో కరీంనగర్ విజిలెన్స్‌టీమ్ సభ్యులతోపాటు ఏసీఎస్‌వో స్వామి, సివిల్ సప్లయ్ డీటీలు తక్కన్న, ప్రకాశ్ పాల్గొన్నారు.


