మొదటి ఆప్షన్‌లో ఓటరు కార్డు నంబరు నమోదు చేస్తే బూత్(పార్ట్), సీరియల్ నంబరు వివరాలు వస్తాయి. ఇది సులభమైన మార్గం.
రెండో ఆప్షన్‌లో ఓటరు పేరు, బంధువు పేరు, వయస్సు, లింగం, జిల్లా, రాష్ట్రం వంటి వివరాలు అక్షర దోషాలు లేకుండా నమోదు చేయాలి.
మూడో ఆప్షన్‌లో ఓటరు కార్డుకు లింక్ అయిన ఫోన్ నంబరుతో రాష్ట్రం ఎంపిక చేసి నమోదు చేస్తే ఓటీపీ వస్తుంది. దానితో వివరాలు లభిస్తాయి.
నాలుగో మార్గంగా ఓటరు కార్డుపై ఉన్న క్యూఆర్ కోడ్ లేదా బార్ కోడ్‌ను స్కాన్ చేయవచ్చు.
న్యూస్‌రీల్
ముసాయిదా ఓటరు జాబితా విడుదల అభ్యంతరాలు, అప్పీల్‌కు నెల రోజులు గడువు ఈఆర్వోల ద్వారా ఆన్ మ్యాప్డ్ ఓటర్లపై విచారణ ఆధారాలు సమర్పిస్తే ఓటు పునరుద్ధరణ
కలెక్టర్ భవేశ్ మిశ్రా
నిర్మల్
రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ
భైంసాటౌన్: పట్టణంలోని కిసాన్‌గల్లి శ్రీసరస్వతీ శిశుమందిరం పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీల్లో సత్తా చాటారు. మహబూబ్‌నగర్ జిల్లాలో సోమవారం జరిగిన వివిధ పోటీల్లో వడ్నం వైష్ణవి, శ్రీరాముల శివాని, శ్రీవల్లి, విజయలక్ష్మి బృందం పాల్గొని ప్రథమ స్థానంలో నిలిచినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు భోజన్న తెలిపారు. ప్రతిభ చూపిన విద్యార్థులను అభినందించారు.
నిర్మల్‌చైన్‌గేట్: ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్)లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితాను పోలింగ్ కేంద్రాల వారీగా సోమవారం విడుదల చేసింది. జూన్ 25 నుంచి ఈ నెల 10వరకు బీఎల్‌వోలు ఇంటింటి సర్వే నిర్వహించారు. 2002 ఓటర్ల జాబితాతో 2025 ఓటర్ల జాబితాను మ్యాపింగ్ చేశారు. ఎన్యూమరేషన్ ఫారాలు అందించి వాటిలో వివరాలు పూరించి ఇచ్చిన వివరాలు డిజిటలైజేషన్ చేశారు. ఈ క్రమంలో సర్‌కు ముందు జిల్లాలో 7,55,344 మంది ఓటర్లు ఉండగా, సర్ తర్వాత 6,42,174కు తగ్గిపోయారు. 1,13,170 ఓట్లు గల్లంతయ్యాయి. మ్యాపింగ్ కానివారు, అక్షర దోషాలు కలిగిన (అనామలీస్) ఓటర్లకు ఈఆర్వోలు నోటీసు జారీ చేయనున్నారు. వీరు ఎన్నికల సంఘం సూచించిన 11 రకాల పత్రాల్లో కావాల్సినవి సమర్పించి ఓటు హక్కు పునరుద్ధరించుకునే వీలుంది.
అనుమానాస్పద ఓట్లపై విచారణ..
సర్ ప్రక్రియలో భాగంగా మ్యాపింగ్ కాని, అనుమానాస్పద, వివరాలు తప్పుగా ఉన్న, ఇంటిపేరు, అక్షర దోషాలు ఉన్నట్లు గుర్తించిన ఓటర్లకు నోటీసులు అందజేసే ప్రక్రియ మొదలైంది. జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల ఈఆర్వోలు బూత్‌స్థాయి అధికారుల ద్వారా నోటీసులు పంపిణీ చేసే ప్రక్రియను చేపట్టారు. పోలింగ్ కేంద్రాల వారీగా నోటీసులు అందించి.. అర్హత నిరూపించుకోవడానికి ఇచ్చిన గడువు, విచారణకు హాజరు కావాల్సిన తేదీలతో కూడిన పత్రాలను పంపిణీ చేస్తున్నారు. నోటీసు అందుకున్న ఓటరు గరిష్టంగా 15 రోజుల వ్యవధిలో ఈఆర్వో ఎదుట విచారణకు హాజరవ్వాలి. ఎన్నికల సంఘం తెలిపిన 11 రకాల ధ్రువపత్రాల్లో ఏదైనా ఒకటి చూపాల్సి ఉంటుంది.
వీడియో కాల్‌లో కూడా పరిశీలన..
ఒక గ్రామం, పట్టణంలో ఎక్కువ మంది నోటీసులు అందుకున్న ఓటర్లు ఉంటే.. వారి వద్దకే ఈఆర్వో, ఏఈఆర్వోలు వెళ్లి విచారణ చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. దూర ప్రాంతంలో ఉన్నవారు, హాజరు కాలేకపోతున్నవారు ఉంటే, వారిని డిజిటల్ విధానంలో విచారించే అవకాశం కల్పించింది. వీడియో కాల్ ద్వారా మాట్లాడి, పత్రాలను ఆన్‌లైన్‌లో తనఖీ చేయనున్నారు. అర్హులైన వారి ఓటు హక్కు కొనసాగించనున్నారు.
ఎవరు ఏ ఫారం సమర్పించాలి..?
ఫారం 6: గతంలో ఓటు ఉండి ప్రస్తుత ముసాయిదా జాబితాలో పేర్లు లేనివారు ఫారం– 6ను, డిక్లరేషన్‌ను సమర్పించాలి.
ఫారం 7: చిరునామా మారిన వ్యక్తి అంతకు ముందు నివసించిన అసెంబ్లీ నియోజకవర్గంలోని జాబితా నుంచి ఓటును తొలగించుకోవాలనుకున్నప్పుడు. ఫారం–7ను సమర్పించాలి. మరణించిన వ్యక్తుల పేర్లను తొలగించేందుకు మరణ ధ్రువీకరణ పత్రం ఇవ్వాలి. శాశ్వతంగా వేరే చోటుకు వెళ్లిన వ్యక్తి కొత్త చిరునామా ఆధారాలను సమర్పించాలి.
ఫారం 8: ఓటరు జాబితాలో పేరున్న వ్యక్తి తన వివరాల్లో మార్పులు చేయించుకునేందుకు ఫారం–8ను సమర్పించాలి. చిరునామా మార్పు, వివరాల సవరణ, ఓటరు కార్డు మార్పు వంటి వాటికి ఈ ఫారం పూర్తిచేసి ఇవ్వాలి.
వుషూలో ఆదర్శ విద్యార్థులు..
కుంటాల: ఆదిలాబాద్ జిల్లా అమెచ్యూర్ వుషూ అసోసియేషన్ ఆధ్వర్యంలో భైంసా పట్టణంలో ఖేలో ఇండియా మహిళా వుషూ బ్యాచ్ 2026 పోటీలు ఇటీవల నిర్వహించారు. పోటీల్లో ఆదర్శ పాఠశాలకు చెందిన హరికృప రజత పతకం, దివ్యశ్రీ, ఆవుల స్రవంతి కాంస్య పతకాలు సాధించారు. వీరిని వుషూ కోచ్ వడ్నం గజేందర్ అభినందించారు.
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ భవేశ్ మిశ్రా
జాబితాలో పేరు
చెక్ చేసుకోవడం ఇలా
ముసాయిదా జాబితాలో తమ పేరు ఉందో లేదో తెలుసుకోవడానికి ఎన్నికల సంఘం రూపొందించిన ‘ఈసీఐనెట్’ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి. యాప్ ఓపెన్ చేసి ఓటర్ సర్వీసెస్‌లో ‘సెర్చ్ యువర్ నేమ్ ఇన్ ఓటర్స్ లిస్ట్’ ఆప్షన్‌ను క్లిక్ చేయాలి. దీనిలో నాలుగు మార్గాలున్నాయి.
నియోజకవర్గాలవారీగా సర్ వివరాలు
కేటగిరీ ఖానాపూర్ నిర్మల్ ముధోల్
చనిపోయినవారు 9,058 9,101 8,705
ఆబ్సెంట్ ఓటర్లు 2,350 13,547 10,718
వలసవెళ్లినవారు 12,844 14,647 14,228
డబుల్ ఓటర్లు 5,745 6,967 5,214
ఇతరులు 0 45 1
వెబ్‌సైట్ ద్వారా ఇలా..
బ్రౌజర్‌లో https://voters.eci.gov.in/ నమోదు చేయండి. సిటిజన్ సర్వీస్ పోర్టల్ తెరుచుకుంటుంది. కుడి వైపు కింది భాగంలో ‘సెర్చ్ యువర్ నేమ్ ఇన్ ఓటర్ లిస్ట్’ ఆప్షన్‌ను క్లిక్ చేసి పైన పేర్కొన్న మార్గాల్లో వివరాలు తెలుసుకోవచ్చు. జాబితాలో పేరు కనిపించకపోతే స్థానిక బీఎల్‌ఓను సంప్రదించి వివరాలు పొందవచ్చు.
ఓటర్ల వివరాలు
నియోజకవర్గం మొత్తం ఓటర్లు డిజిటలైజేషన్ ఎన్యుమరేషన్ వివరాల్లో తేడాలు
పూర్తయినవి ఫారాలు తిరిగి ఇవ్వనివారు
నిర్మల్ 2,64,070 2,19,763 44,307 74,649
ఖానాపూర్ 2,30,162 2,00,165 29,997 57,909
ముధోల్ 2,61,112 2,22,246 38,866 63,544


