కడెం: మండలంలోని లింగాపూర్ జిల్లా పరిషత్ పాఠశాల ఉపాధ్యాయుడు వాల్గోట్ కిషన్ శివనాడార్ ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ఇండియాస్ బెస్ట్ టీచర్ అవార్డుకు ఎంపిక అయ్యారు. యూనివర్సిటీ అన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న 40 మంది, ప్రైవేటు పాఠశాలల్లో పనిచేస్తున్న 40 మందిని బెస్ట్ టీచర్ అవార్డుకు ఎంపిక చేసింది. ఇందులో 16 మందికి ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో వారం రోజులు శిక్షణ ఇప్పించనుంది. మిగతా 64 మందికి ఢిల్లీలో అవార్డులు ప్రదానం చేస్తారు. వాల్గోట్ కిషన్ 28 ఏళ్లుగా విద్య, సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఆయన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డుకు ఎంపిక చేసింది.


