నిర్మల్‌చైన్‌గేట్: జిల్లాలో 15 రోజుల తర్వాత కలెక్టరేట్‌లో ప్రజావాణి నిర్వహించారు. దీంతో కలెక్టర్‌కు తమ గోడు చెప్పుకునేందుకు భారీగా జిల్లా నలు మూలల నుంచి బాధితులు అర్జీలు చేతపట్టకుని వచ్చారు. అనదపు కలెక్టర్లు వెకంటేశ్వర్లు, కిశోర్‌కుమార్ అర్జీలు స్వీకరించారు. బాధితుల సస్యలు తెలుసుకున్నారు. అర్జీలను సంబంధిత శాఖల అదికారులకు అందించి త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. ఇదిలా ఉంటే సోమవారం మండల స్థాయిలోనూ ప్రజావాణి ప్రారంభమైంది. కానీ చాలా మండలాల్లో పెద్దగా స్పందన లేదు. కలెక్టరేట్ ప్రజావాణికి 82 దరఖాస్తులు వచ్చాయి. 19 మండలాల్లో 147 అర్జీలు వచ్చాయి. మండల ప్రజావాణి కారణంగా కలెక్టరేట్‌కు వచ్చే అర్జీలు ఏమాత్రం తగ్గలేదు.
మండలాల వారీగా
వచ్చిన దరఖాస్తులు..
నర్సాపూర్(జి) 40
సారంగాపూర్ 18
కుభీర్ 14
భైంసా రూరల్ 8
మామడ 8
లోకేశ్వరం 8
నిర్మల్ రూరల్ 8
తానూరు 6
దస్తురాబాద్ 4
లక్ష్మణచాంద 3
సోన్ 3
ఖానాపూర్ 3
బాసర 2
కడెం 14
కుంటాల 4
ముధోల్ 3
దిలావర్‌పూర్ 1
పెంబి 0


