పెళ్లి కుదిరింది! ఫోన్ మాట్లాడొద్ద‌ని త‌ల్లి బెదిరించ‌డంతో.. యువ‌తి | - | Sakshi
Sakshi News home page

పెళ్లి కుదిరింది! ఫోన్ మాట్లాడొద్ద‌ని త‌ల్లి బెదిరించ‌డంతో.. యువ‌తి

Dec 19 2023 1:18 AM | Updated on Dec 19 2023 1:01 PM

- - Sakshi

నిర్మల్‌: తల్లి మందలించిందని యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం మండలంలోని దేవునిగూడెం గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్సై ప్రభాకర్‌రెడ్డి వివరాల ప్రకారం.. మండలంలోని దేవునిగూడెం గ్రామానికి చెందిన పానుగంటి గంగవ్వ–పోషన్నలకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు. తండ్రి గతంలో మృతిచెందడంతో తల్లి గంగవ్వనే కుటుంబాన్ని పోషిస్తుంది. ఇటీవల పెద్ద కూతురు సాత్విక(22) పెళ్లి కుదిరింది.

గత కొద్ది రోజులగా తరుచుగా ఫోన్‌లో మాట్లాడుతుండడంతో తల్లి ఆదివారం మందలించింది. దీంతో మనస్తాపానికి గురై పురుగుల మందు తాగింది. కుటుంబీకులు వెంటనే నిర్మల్‌లోని ప్రైవేట్‌ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందింది. మృతదేహన్ని ఖానాపూర్‌ ప్రభుత్వాస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసున్నట్లు తెలిపారు.

ముఖ్య గమని​క: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com
ఇవి చ‌ద‌వండి: బిస్కెట్‌ ప్యాకెట్‌ కొనుక్కొని వస్తుండగా.. ఘోర ప్ర‌మాదం!

Advertisement
 
Advertisement
Advertisement