లోకేశ్వరం: ఉపాధ్యాయులకు సంబంధించిన జీపీఎప్, టీఏజేఎల్‌ఐ బిల్లులు ఇప్పించేందుకు పీఆర్టీయూ కృషి చేస్తోందని యూనియన్ జిల్లా అధ్యక్షుడు తోట నరేంద్రబాబు తెలిపారు. మండల కేంద్రంలో యూనియన్ మండల సర్వసభ్య సమావేశం మంగళవారం నిర్వహించారు. కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నా రు. మండల అధ్యక్షుడుగా జెడ్ల రాజారాం, ప్రధాన కార్యదర్శిగా ప్రభాకర్, ఉపాధ్యక్షుడిగా భోజన్న, మహిళ ఉపాధ్యాక్షులుగా భారతి, అసోసియేట్ అధ్యక్షులుగా మురళీధర్, రాణి, కార్యదర్శులుగా గంగాధర్, నాగన్న, మహిళ కార్యదర్శులుగా కృష్ణవేణి, నవతను ఎన్నుకున్నారు. పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి రామాణారవు, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు సదానందం, దేవేందర్, నాయకులు సురేశ్‌రావు, అశోక్‌రెడ్డి, వెంకటరమణ పాల్గొన్నారు.


