క్లిక్‌ చేస్తే కష్టాలే | - | Sakshi
Sakshi News home page

క్లిక్‌ చేస్తే కష్టాలే

Aug 5 2026 2:05 AM | Updated on Aug 5 2026 2:05 AM

● సైబర్‌ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి ● ఎస్పీ జానకీషర్మిల

నిర్మల్‌టౌన్‌: సెల్‌ఫోన్లకు వచ్చే మెస్సేజ్‌ లింక్స్‌పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ జానకీషర్మి ల సూచించారు. తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూ రో ఆదేశాల మేరకు ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ప్రతీనెల మొదటి బుధవారం జిల్లాలో సైబర్‌ జాగృతి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలి పారు. ఇందులో భాగంగా స్వాతంత్య్ర దినోత్సవంపురస్కరించుకొని ‘సురక్షా కా తిరంగా–స్టే అలర్ట్‌ –స్టే అవేర్‌–స్టే సైబర్‌ సేఫ్‌’ అనే సందేశంతో రూపొందించిన అవగాహన పోస్టర్లను మంగళవా రం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో విడుదల చేశారు.

నకిలీ యాప్‌లు, ప్రకటనలతో జాగ్రత్త..

సైబర్‌ నేరగాళ్లు రోజురోజుకూ కొత్త పద్ధతుల్లో ప్రజ లను మోసం చేస్తున్నారని ఎస్పీ తెలిపారు. నకిలీ ట్రేడింగ్‌, ఇన్వెస్ట్‌మెంట్‌ యాప్‌లు, అధిక లాభాల పేరుతో వచ్చే ప్రకటనలు, ప్రముఖుల ఫొటోలు, మార్ఫింగ్‌, నకిలీ సంస్థల పేర్లు, లోగోలతో వచ్చే పెట్టుబడి ప్రకటనలను నమ్మవద్దని హెచ్చరించారు. ట్రేడింగ్‌ యాప్‌లో భారీ లాభాలు నిజంగా డబ్బు పెరుగుతోందని భావించకూడదన్నారు.

పరిశీలన తప్పనిసరి

ఏదైనా సంస్థలో పెట్టుబడి పెట్టే ముందు దాని విశ్వసనీయత, అధికారిక వెబ్‌సైట్‌, యాప్‌ డౌన్‌లోడ్‌ సోర్స్‌ను తప్పనిసరిగా ధ్రువీకరించుకోవాలని సూ చించారు. ఆకర్షణీయమైన ప్రకటనలు, ప్రముఖుల పేర్లను చూసి తొందరపడి డబ్బులు బదిలీ చేయవద్దన్నారు. ‘అప్రమత్తత+అవగాహన=సైబర్‌ భద్రత’ అనే సందేశాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు. ‘ఫ్రాడ్‌ కా ఫుల్‌స్టాప్‌’తో సైబర్‌ నేరాలకు అడ్డుకట్ట వేయాలని పిలుపునిచ్చారు.

మోసపోతే 1930కు కాల్‌ చేయాలి..

సైబర్‌ మోసానికి గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు సమాచారం అందించాలని ఎస్పీ సూచించారు. అలాగే నేషనల్‌ సైబర్‌ క్రైమ్‌ రిపోర్టింగ్‌ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని తెలిపారు. భైంసా ఏఎస్పీ సాయి కిరణ్‌, నిర్మల్‌ డీఎస్పీ శ్రీనివాస్‌, నిర్మల్‌ పట్టణ సీఐ సమ్మయ్య, సైబర్‌ క్రైమ్‌ ఇన్‌స్పెక్టర్‌ రమణ, ఆర్‌ఐ రామ్‌ నిరంజన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement