న్యూస్‌రీల్
ఇటీవలి వర్షాలతో అన్నదాతకు భరోసా నిండు కుండలా జిల్లా జలాశయాలు జోరందుకున్న వ్యవసాయ పనులు
నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి
నిర్మాణాలు ఇలా.. నీరు వెళ్లేదెలా?
ఆకాశం పూర్తిగా మేఘావృతమవుతుంది. ఉష్ణోగ్రతలు సాధారణంగా నమోదవుతాయి. రుతుపవనాలు చురుగ్గా కదులుతుండడంతో చాలా చోట్ల మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది.
ఇంటర్ కళాశాలల్లో క్వాలిటీ ఫుడ్..
విద్యార్థుల ఆరోగ్య భద్రతపై ఇంటర్ విద్యాశాఖ దృష్టి సారించింది. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అల్పాహారం, మధ్యాహ్నం భోజనం అమలు చేసేందుకు చర్యలు చేపట్టింది.
‘సదర్మాట్’పై లిఫ్ట్
ఏర్పాటు చేయాలి
మామడ: సదర్మాట్ బ్యారేజీపై లిఫ్ట్ ఏర్పాటు చేసి వ్యవసాయ భూములకు సాగునీరు అందించాలని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి కూచాడి శ్రీహరిరావు కోరారు. ఈమేరకు రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి మండల నాయకులతో కలిసి హైదరాబాద్‌లో మంగళవారం వినతిపత్రం అందించారు. లిఫ్ట్ ఏర్పాటు చేస్తే మండలలోని పొన్కల్, మామడ, దిమ్మదుర్తి, కప్పన్‌పల్లి, నల్దుర్తి గ్రామాల సాగు భూములకు సాగునీరు అందుతుందని తెలిపారు. నాయకులు గంగారెడ్డి, లింగారెడ్డి, పడాల శ్రీనివాస్ ఉన్నారు.
గడ్డెన్నవాగులోనూ..
గడ్డెన్నవాగు ప్రాజెక్టులో 356.90 మీటర్ల నీటిమట్టంతో 0.918 టీఎంసీల నీటి నిల్వ నమోదైంది. 24 గంటల్లో 231 క్యూసెక్కుల సగటు ఇన్‌ఫ్లో రాగా, 20 క్యూసెక్కుల నీటిని మిషన్ భగీరథకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు గేట్లు మూసివేసి ఉన్నాయి. ఈ ప్రాజెక్టు కింద 13,950 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనుంది.
భైంసా: ఇటీవల మహారాష్ట్రతోపాటు, జిల్లాలో కురిసిన భారీ వర్షాలు జిల్లా రైతుల్లో కొత్త ఆశలు నింపాయి. ఎల్‌నినో ప్రభావం తగ్గి మంచి వర్షాలు కురవడంతో ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (ఎస్సారెస్పీ)లోకి వరద ప్రవాహం కొనసాగుతోంది. జిల్లాలోని కడెం, స్వర్ణ, గడ్డెన్నవాగు ప్రాజెక్టుల్లోనూ నీటి నిల్వలు మెరుగుపడుతున్నాయి. దీంతో ఖరీఫ్‌సాగుతోపాటు తాగునీటి అవసరాలపై నెలకొన్న ఆందోళన క్రమంగా తొలగిపోతోంది. ఎస్సారెస్పీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు కల్పతరువు. మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో జలాశయంలోకి వరద వస్తోంది. నీటిమట్టం పెరుగుతోంది.
జోరందుకున్న సాగు..
ఎల్‌నినోప్రభావంతో ఈ ఖరీఫ్‌లో పంటల సాగుకు రైతులు ఇంతకాలం వెనుకాడారు. ఇటీవల కురిసిన వర్షాలతో జలాశయాలు నిండాయి. దీంతో రైతుల్లో ఉత్సాహం కనిపిస్తోంది. సాగు పనుల జోరు పెంచారు.
వర్షాలు ఇదే విధంగా కొనసాగితే నాలుగు ప్రధాన ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు మరింత పెరిగే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. దీంతో ఖరీఫ్ సాగుకు నీటి కొరత ఉండదనే విశ్వాసం రైతుల్లో వ్యక్తమవుతోంది. ఎల్‌నినో ప్రభావం తగ్గి మంచి వర్షాలు కురవడంతో రైతులు హుషారుగా ఉన్నారు.
స్వర్ణ ప్రాజెక్టు..
ప్రస్తుత నీటిమట్టం 1,181 అడుగులు
నీటి నిల్వ 0.830 టీఎంసీలు
(పూర్తి సామర్థ్యం 1.037 టీఎంసీలు)
ఇన్‌ఫ్లో 100 క్యూసెక్కులు
ఔట్‌ఫ్లో లేదు
ఖరీఫ్‌కు భరోసా..
కొంతకాలంగా వర్షాలు లేక ప్రాజెక్టుల్లో నీరు తగ్గిపోవడంతో సాగుపై ఆందోళన నెలకొంది. ఇప్పుడు ఎస్సారెస్పీలోకి వరద నీరు చేరుతుండటంతో సరస్వతీ కాలువ ద్వారా నీరు వస్తుందనే నమ్మకం కలిగింది. ఖరీఫ్‌పై భరోసా దక్కింది. నీరు వదిలితే పంటలతో పాటు బోరుబావులకు కూడా రీచార్జి అవుతాయి.
– గోవర్ధన్, రైతు
భూగర్భ జలాలు పెరుగుతాయి
ఎస్సారెస్పీతోపాటు కడెం, స్వర్ణ, గడ్డెన్నవాగు ప్రాజెక్టుల్లో కూడా నీటి నిల్వలు పెరగడం జిల్లాకు శుభపరిణామం. చెరువులు నిండితే భూగర్భ జలాలు పెరుగుతాయి. సాగునీటి సమస్య తగ్గి రైతులు ధైర్యంగా వ్యవసాయం చేస్తారు. ఇలాగే మరికొన్ని రోజులు వర్షాలు కురిస్తే ఈ ఖరీఫ్ సీజన్‌కు ఢోకా ఉండదు.
– అనిల్ కుమార్, ఇరిగేషన్ ఈఈ
రేపు జాబ్‌మేళా
నిర్మల్‌టౌన్: జిల్లా ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో ఈనెల 6న(గురువారం) ఉదయం 11 గంటలకు నిర్మల్ డిగ్రీ కళాశాల సెమినార్ హాల్‌లో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి జి.విజయలక్ష్మి తెలిపారు. సుభగృహ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, అపోలో ఫార్మసీలో మొత్తం 80 ఉద్యోగ ఖాళీలకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. 18 నుంచి 30 ఏళ్ల వయసు న్న ఫ్రెషర్స్ కూడా అర్హులని తెలిపారు. అర్హత, ఆసక్తి ఉన్న యువతీ యువకులు రెజ్యూమ్, విద్యార్హత సర్టిఫికెట్లు, ఆధార్ జిరాక్స్ ప్రతులతో హాజరు కావాలని సూచించారు. వివరాలకు 7329911657, 8247656356, 9652707401 నంబర్లలో సంప్రదించాలని తెలిపారు.
గడ్డెన్నవాగు ప్రాజెక్టు
ప్రస్తుత నీటిమట్టం 356.90 మీటర్లు
నీటి నిల్వ 0.918 టీఎంసీలు
(పూర్తి సామర్థ్యం 1.83 టీఎంసీలు)
ఇన్‌ఫ్లో 231 క్యూసెక్కులు
ఔట్‌ఫ్లో 20 క్యూసెక్కులు


