నిర్మల్‌చైన్‌గేట్: జిల్లాలోని అన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు పోషకాహారం అందించాలని కలెక్టర్ భవేశ్‌మిశ్రా అధికారులను ఆదేశించారు. కలెక్టరే ట్ సమావేశ మందిరంలో అంగన్‌వాడీలు, గిరిజ నాభివృద్ధి సంస్థ విద్యాసంస్థలపై మంగళవారం సమీక్ష నిర్వహించారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారుల వికాస వివరాలు ఎప్పటికప్పుడు నమో దు చేసుకుంటూ ఉండాలన్నారు. పోషక లోపం కలిగిన పిల్లలను గుర్తించి, వారికి ప్రత్యేక పోషకాహారం అందించాలని తెలిపారు. అంగన్‌వాడి సూపర్‌వైజర్లు ఎప్పటికప్పుడు కేంద్రాలను తనిఖీ చేయాలని సూచించారు. పిల్లల హాజరు, అందిస్తు న్న ఆహారం, కల్పిస్తున్న వసతులు పరిశీలించి వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. అభా గుర్తింపు కార్డుల నమోదు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. వలస కూలీల పిల్లలను గుర్తించి వారికి తప్పనిసరి గా పోషకాహారం అందించేలా చర్యలు తీసుకో వా లన్నారు. అనుమతులు లభించిన అంగన్‌వాడీ భవ న నిర్మాణాలు వేగవంతంగా పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. గిరిజనాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలోని విద్యాసంస్థల్లో విద్యార్థులందరికీ నాణ్యమైన వసతులతో కూడిన విద్య అందించాలన్నారు. ప్రీమెట్రిక్, పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాలపై చర్చించారు. సమావేశంలో డీటీడీవో నిహారిక, సంక్షేమ అధికారి వినూత్న పాల్గొన్నారు.


