ప్రస్తుతం ప్రాజెక్టు 700 అడుగుల పూర్తి నీటిమట్టంతో 3.495 టీఎంసీల పూర్తి సామర్థ్యానికి చేరుకుంది. ప్రాజెక్టులోకి 4,437 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా ఒక గేటు ఎత్తి అంతేమొత్తంలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు కింద 68,150 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనుంది.
కడెం ప్రాజెక్టు..
ప్రస్తుత నీటిమట్టం 700 అడుగులు
(పూర్తి స్థాయి)
నీటి నిల్వ 3.495 టీఎంసీలు
ఇన్‌ఫ్లో 4,437 క్యూసెక్కులు
ఔట్‌ఫ్లో 4,278 క్యూసెక్కులు


