ఢిల్లీ నిరసనలు.. జెన్‌జీపై మోదీ కీలక వ్యాఖ్యలు | you have solutions the world needs pm narendra modi outreach to gen z in chennai | Sakshi
Sakshi News home page

ఢిల్లీ నిరసనలు.. జెన్‌జీపై మోదీ కీలక వ్యాఖ్యలు

Oct 11 2026 8:04 PM | Updated on Oct 11 2026 8:14 PM

you have solutions the world needs pm narendra modi outreach to gen z in chennai

చెన్నై: ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాలు చూపించే సామర్థ్యం జెన్‌-జీ యువతకు ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. యువత తమ భవిష్యత్తును విశాల దృక్పథంతో చూడాలని, పెద్ద కలలు కనాలని, వినూత్నంగా ఆలోచిస్తూ నిర్భయంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. చెన్నైలోని నందంబాక్కంలో జైగోపాల్‌ గరోడియా హిందూ విద్యాలయ మెట్రిక్యులేషన్‌ హయ్యర్‌ సెకండరీ పాఠశాల స్వర్ణోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు.

ఆయన మాట్లాడుతూ ‘‘నేడు ప్రపంచం అనేక సమస్యలకు పరిష్కారాల కోసం ఎదురుచూస్తోంది. ఆ పరిష్కారాలను అందించే సామర్థ్యం మీలో ఉంది. ప్రతి యువకుడు తన భవిష్యత్తును విశాలమైన దృక్పథంతో చూడాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది మీ సమయం.. మీకు లభించిన గొప్ప అవకాశం.మీలో ప్రతి ఒక్కరూ నిర్భయంగా ఉండేందు్కు మీకు మీరే అవకాశం ఇచ్చుకోండి. మీ ఆలోచనలపై పనిచేయండి. పెద్ద కలలు కనండి. భిన్నంగా ఆలోచించండి. ఎలాంటి భయం లేకుండా ముందుకు సాగండి’ అని అన్నారు.

అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణానికి అవసరమైన కొత్త ఆలోచనలు, పరిష్కారాలు కేవలం దేశ భవిష్యత్తునే కాకుండా ప్రపంచ భవిష్యత్తును కూడా ప్రభావితం చేస్తాయని  పేర్కొన్నారు. తాను వారణాసి (కాశీ) ప్రజల ప్రతినిధినని మోదీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. నిర్భయంగా జీవించాలనే స్ఫూర్తిని అందించే మహాకవి సుబ్రహ్మణ్య భారతి రచనలను ప్రస్తావిస్తూ యువతకు కీలక సందేశమిచ్చారు.  భారతదేశంలో అపారమైన అవకాశాలు ఉన్నాయని, యువత తమ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.

ఢిల్లీ నిరసనలు.. మోదీ వ్యూహం

కాగా సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌కు ‍వ్యతిరేకంగా సీజేపీ ఆధ్యర్యంలో నిన్న (ఆదివారం) ఢిల్లీలో పెద్దఎత్తున నిరసనలు జరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దేశంలోని జెన్‌-జీ యువతకు ప్రతినిధి పార్టీగా గుర్తింపు పొందిన సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కే, మరో ఇద్దరు నేతలు సౌరవ్‌ దాస్‌, ఆశుతోష్‌ రంకాలను ముంబయి నుంచి ఢిల్లీకి చేరుకున్న విమానం దిగిన కొద్దిసేపటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరితో పోటు మాజీ సీఎంలో మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్‌ ఇతరులను అరెస్ట్ చేశారు. మెుత్తంగా  3,000 మందిని కూడా నిర్బంధించినట్లు సమాచారం.

సుప్రీం కీలక ఆదేశాలు

ఢిల్లీలో నిరసనల నేపథ్యంలో విధించిన ఆంక్షలపై సుప్రీంకోర్టు ఆదివారం ప్రత్యేక విచారణ చేపట్టింది. అత్యవసర పరిస్థితుల్లో తప్ప మిగిలిన అన్ని చోట్లా బారికేడ్లను తొలగించాలని అధికారులను ఆదేశించింది. అలాగే, పెద్ద సంఖ్యలో ప్రజలు ఒకచోట గుమికూడకుండా నిషేధించే భారతీయ నాగరిక్‌ సురక్షా సంహిత (బీఎన్‌ఎస్‌ఎస్‌), 2023లోని సెక్షన్‌ 163 అమలును ఉపసంహరించుకోవాలని సూచించింది.

ఇదీ చదవండి: ఢిల్లీ నిరసనల్లో అమ్మాయిల దాడులు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement