Woman Forces Lover For Marriage Takes Him From Office To Temple Bihar - Sakshi
Sakshi News home page

లవర్‌కి ఊహించని షాకిచ్చిన యువతి.. నేరుగా ఆఫీస్‌కు వెళ్లి

May 27 2023 6:34 PM | Updated on May 27 2023 7:18 PM

Woman Forces Lover For Marriage Takes Him From Office To Temple Bihar - Sakshi

భోపాల్‌: ప్రేమించిన యువకుడు పెళ్లికి నిరాకరించడంతో ఓ యువ‌తి అతని  ఆఫీస్‌కు వెళ్లి చొక్కా పట్టుకుని నిలదీసింది. ఈ  ఘటన బీహార్‌లో భాగల్‌పూర్‌లోని చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. భాగల్‌పూర్‌లోని మధుసూదన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భథోడియా గ్రామానికి చెందిన కరిష్మా అనే యువతి అదే గ్రామానికి చెందిన రోహిత్ కుమార్‌తో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారడంతో వారిద్దరూ రెండేళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నారు.

గత కొద్ది రోజులుగా యువతి పెళ్లికి పట్టుబట్టడంతో రోహిత్ ఆమె నుదుటిపై సిందూరం పెట్టి తన ఇంటికి తీసుకెళ్లాడు. అయితే, రోహిత్‌ కుటుంబం కరిష్మాను కోడలిగా అంగీకరించలేదు. అంతేకాకుండా ఆమెను వారి ఇంటి నుంచి గెంటేసారు. దీంతో కరిష్మా అతనిపై అత్యాచారం కేసు నమోదు చేయడంతో రోహిత్ జైలు పాలయ్యాడు. ఆ త‌ర్వాత రోహిత్ బెయిల్‌పై బ‌య‌టికి వ‌చ్చాడ‌ని తెలిసి క‌రిష్మా నేరుగా అత‌న ప‌నిచేస్తున్న ఆఫీస్‌కి వెళ్లింది.

 పెళ్లి చేసుకుంటావా లేదా అంటూ అంద‌రి ముందు కాల‌ర్ ప‌ట్టుకుని నిల‌దీసింది. అత‌ను పెళ్లి చేసుకోను అని చెప్ప‌డంతో అంద‌రూ చూస్తుండ‌గానే ష‌ర్టు పట్టుకుని ద‌గ్గ‌ర్లోని గుడికి తీసుకెళ్లే ప్ర‌య‌త్నం చేసింది. ఒకవేళ అతను పెళ్లికి నిరాకరిస్తే విషం తీసుకుంటానని బెదిరించింది. దీంతో రోహిత్‌ పని చేస్తున్న ఆఫీస్‌ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ జంటను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారికి కౌన్సిలింగ్‌ ఇచ్చి పంపారు. తదుపరి విచారణ కోసం ఇద్దరి కుటుంబాలను కూడా పిలిపించారు.

చదవండి:  మెుబైల్ మాల్‌వేర్ 'దామ్'తో జాగ్రత్త.. కేంద్రం అలర్ట్‌..

Advertisement
 
Advertisement
Advertisement