పెళ్లి విందు: తుపుక్‌మంటూ రోటీ మీద ఉమ్మేసి | Viral Video: Man Making Rotis In Tandoor After Spitting On Them | Sakshi
Sakshi News home page

వైరల్‌: ఉమ్ముతూ రోటీలు చేసిన వ్యక్తి

Feb 21 2021 1:50 PM | Updated on Feb 21 2021 3:25 PM

Viral Video: Man Making Rotis In Tandoor After Spitting On Them - Sakshi

అతడు ఎవరూ చూడట్లేదు కదా అన్నట్లుగా ఓ లుక్కిచ్చుకుని రోటీ మీద తుపుక్కుమని ఉమ్మేశాడు. అలా ఏదో ఒకదాని మీద ఉమ్మేసి వదిలేయలేదు.

చాలామందికి పెళ్లంటే గుర్తొచ్చేది కమ్మని విందు భోజనమే.. వెజ్‌ అయినా నాన్‌వెజ్‌ అయినా రకరకాల వంటకాలతో వివాహానికి వచ్చినవారి కడుపు నింపుతారు. అందుకే ఎప్పుడైనా పెళ్లికి వెళ్లాల్సి వస్తే ఓ పూట కడుపు ఖాళీగా ఉంచుకుని మరీ విందుకు రెడీ అవుతుంటారు. కానీ ఈ వీడియో చూశాక మాత్రం పెళ్లి భోజనం అంటే బెంబేలెత్తిపోవడం ఖాయం.

లక్నో: ఉత్తర ప్రదేశ్‌లోని మీరట్‌లో ఓ పెళ్లితంతు ఘనంగా జరిగింది. అక్కడికి వచ్చిన అతిథుల కోసం ఓ వ్యక్తి తందూరీ రోటీ చేశాడు. ఆ సమయంలో అతడికి దగ్గర్లో ఇతర వంటగాళ్లు ఎవరూ లేనట్లున్నారు. ఇంతలో అతడు ఎవరూ చూడట్లేదు కదా అన్నట్లుగా ఓ లుక్కిచ్చుకుని రోటీ మీద తుపుక్కుమని ఉమ్మేశాడు. అలా ఏదో ఒకదాని మీద ఉమ్మేసి వదిలేయలేదు. అతడు చేసిన ప్రతి రోటీ మీద ఇలాగే ఉమ్మాడు. దీన్నంతటినీ ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు.

ఇంకేముందీ, ఈ వీడియో కాస్త వైరల్‌గా మారగా మీరట్‌ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఉద్దేశ్యపూర్వకంగా రోటీని నాశనం పట్టించిన అతడిని మీరట్‌కు చెందిన సోహైల్‌గా గుర్తించారు. ఇక ఈ వీడియో చూసిన జనాలు అతడి నిర్వాకానికి శివాలెత్తిపోతున్నారు. ఛీ ఇదేం గలీజు పనిరా నాయనా అని ఆగ్రహంతో ఊగిపోతున్నారు. అతడికిదేం పోయేం కాలం అని తిట్టిపోస్తూ కామెంట్లు చేస్తున్నారు. కొంపదీసి ఆ రోటీలను పెళ్లికి వచ్చినవాళ్లు తిన్నారా? ఏంటని ఆరా తీస్తున్నారు.

చదవండి: వైరల్‌: అమ్మాయిని ముద్దు లంచంగా అడిగిన పోలీస్‌

వైరల్‌: వంటకు సాయం చేస్తున్న కోతి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement