వైరల్‌: అమ్మాయిని ముద్దు లంచంగా అడిగిన పోలీస్‌

Peru Police Asked Kiss As A Bride From Woman - Sakshi

లిమ : కరోనా వైరస్‌ లాక్‌డౌన్‌ నిబంధనలను అతిక్రమించిన ఓ అమ్మాయిని ముద్దు లంచంగా అడిగాడో పోలీస్‌. లంచాలు తీసుకునే బుద్ధి మంచం దగ్గర ఆగలేదన్న సామెతగా, అమ్మాయి ముద్దుకు కక్కుర్తిపడి సస్పెండ్‌ అయ్యాడు. ఈ సంఘటన పెరులోని లిమలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. లిమకు చెందిన ఓ అమ్మాయి కొద్దిరోజుల క్రితం అక్కడి మిరఫ్లోర్స్‌లోని బ్రాడ్‌ వాక్‌ వద్ద ఉన్న రోడ్డు పక్కగా తన కారు ఆపి, పక్కకు వెళ్లింది. లాక్‌డౌన్‌ నిబంధనల ప్రకారం ఆ ప్రదేశంలో కారు నిలపడం నిషిద్ధం. దీంతో ఓ పోలీస్‌ ఆ కారు దగ్గరకు వచ్చి నిలబడ్డాడు. కొద్ది సేపటి తర్వాత ఆ అమ్మాయి కూడా అక్కడికి వచ్చింది. ఆ పోలీస్‌ ఆమెనుంచి వివరాలు సేకరించటం మొదలుపెట్టాడు. ఫైన్‌ వేస్తున్నట్లు ఆమెతో చెప్పాడు. ఫైన్‌ వేయోద్దని ఆ అమ్మాయి పోలీస్‌ను బ్రతిమాలింది. ( కోతికున్న ఇగురం కట్టుకున్నోడికి లేకపాయె! )

కొద్దిసేపటి చర్చల తర్వాత ఇద్దరి మధ్యా ఓ ఒప్పందం కుదిరింది.  ఆ ఒప్పందం ప్రకారం అమ్మాయినుంచి ముద్దు లంచంగా తీసుకుని పోలీస్‌ ఆమెను వదిలేశాడు. అయితే ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ టీవీ కెమెరాల్లో రికార్డ్‌ అయ్యాయి. ఓ లోకల్‌ న్యూస్‌ ఛానల్‌ మొదటగా ఇందుకు సంబంధించిన వీడియోను ప్రసారం చేసింది. దీంతో ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై స్పందించిన అధికారులు. సదరు పోలీస్‌పై సీరియస్‌ అయ్యారు. ఈ సంఘటనపై విచారణకు ఆదేశించారు. అతడ్ని విధుల్లోనుంచి సస్పెండ్‌ చేశారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top