వైరల్‌: వంటకు సాయం చేస్తున్న కోతి!

Viral Video: Monkey Helps Woman In Cutting Vegetables - Sakshi

ఆలూమగలన్నాక కోపతాపాలు, సుఖదుఃఖాలు, కష్టనష్టాలు అన్నీ ఉంటాయి. వాటన్నింటినీ చెరిసగం పంచుకుంటూ ప్రేమ అనే నావతో సంసార సాగరాన్ని ఈదక తప్పదు. అయితే నచ్చింది కొనివ్వడం లేదని, పనుల్లో కాస్తైనా సాయం చేయడం లేదని భార్య కట్టుకున్నవాడి మీద కస్సుబుస్సులాడుతుంది. ఆమె కోరికల చిట్టాను తీర్చాలంటే కుబేరుడి దగ్గర ఉన్న ధనం కూడా సరిపోదని, ఆమె వాగుడుతో వేగలేకున్నామని భార్య మీద అసహనం వ్యక్తం చేస్తుంటారు మగ మహానుభావులు. కానీ ఇక్కడో కోతి మాత్రం ఓ మహిళకు నేనున్నానంటూ వంటపనిలో సాయం చేసింది.

వినడానికి విడ్డూరంగా ఉన్న ఈ ఘటన ఎక్కడ జరిగిందన్న వివరాలు తెలియరాలేదు. కానీ, దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో ఓ మహిళ కూరగాయలు కట్‌ చేస్తోంది. సాయం చేయడానికి నేనున్నాగా అన్నట్లుగా ఓ కోతి అక్కడే బుద్ధిగా కూర్చుంది. దీంతో ఆమె తన చేతిలో ఉన్న వాటిని కోతి ఎదురుగా ఉన్న గిన్నెలో వేసింది. ఇంకేముందీ వానరం వాటన్నింటినీ చకాచకా చేతితో విరుస్తోంది. దానికి ఇంతకుముందే ట్రైనింగ్‌ ఇచ్చినట్లుగా ఎంతో స్పీడ్‌గా పని చేయడం విశేషం. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. 'కోతికున్న ఇగురం కట్టుకున్నోడికి లేకపాయె' అని ఒకావిడ తన భర్త ఏ సాయమూ చేయడని చురకలంటించగా, దీనికి ఇంత టాలెంట్‌ ఎక్కడ నుంచి వచ్చిందోనని మరికొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు

చదవండి: గాలి ద్వారా గర్భం.. గంటలోనే ప్రసవం!

వైరల్‌: బుర్ర పనిచేసింది.. లేదంటే..

అచ్చం ఇస్మార్ట్‌ శంకర్‌ సినిమాలోలా..

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top