త్వరలో.. అన్నయ్యసారె! | Vijay's Annan Seer scheme | Sakshi
Sakshi News home page

త్వరలో.. అన్నయ్యసారె!

Oct 8 2026 6:35 AM | Updated on Oct 8 2026 6:35 AM

Vijay's Annan Seer scheme

సాక్షి,చెన్నై: తమిళనాడు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన అన్నన్‌ సీర్‌(అన్నయ్య సారె) పథకం అమలుకు సంబంధించి సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి ఎం. పల్లవి బల్దేవ్‌ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పథకానికి అవసరమైన ఆర్థిక అనుమతులు మంజూరు చేస్తూ షరతులను ప్రకటించారు. 

పథకం ఉద్దేశం.. 
తమిళనాడులో వివాహం చేసుకోబోయే వధువులకు ప్రభుత్వ కానుకగా 8 గ్రాముల (22 క్యారెట్ల) బంగారు నాణెం , పట్టు చీరను అందించడమే ఈ పథకం ప్రధాన లక్ష్యం. కుటుంబ వార్షిక ఆదాయం రూ. 2.5 లక్షల వరకు ఉన్న వధువులకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. ప్రభుత్వ ఉత్తర్వు వెలువడిన తేదీ నుండి జరిగే వివాహాలకు ఈ పథకం వర్తిస్తుందని స్పష్టం చేశారు. సామాజిక సంక్షేమ శాఖ డైరెక్టర్‌ విజ్ఞప్తి మేరకు, తొలి విడతగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ. 812 కోట్ల నిధులను ప్రభుత్వం కేటాయించింది. 

అర్హులు దరఖాస్తు చేసుకోవడానికి త్వరలోనే ఒక ప్రత్యేక వెబ్‌సైట్‌ను ప్రారంభించనున్నారు. కాగా,  ఎన్నికల సమయంలో కుటుంబ వార్షిక ఆదాయ పరిమితిని రూ. 5 లక్షల వరకు ఇస్తామని హామీ ఇచ్చినప్పటికీ, ప్రస్తుతం అమలు చేసేటప్పుడు ఆ ఆదాయ పరిమితిని రూ. 2.5 లక్షలకు తగ్గించడం రాజకీయంగా , ప్రజావర్గాలలో చర్చకు దారితీసింది. కాగా, గతంలో అన్నాడీఎంకే హయంలో తాళికి బంగారం పేరిట పథకాన్ని అమలు చేస్తూ వచ్చారు. దీనిని డీఎంకే సర్కారు తుంగలో తొక్కగా, తాజాగా మెరుగులు దిద్ది అన్నయ్య సారెగా అమలుకు సీఎం విజయ్‌ టీవీకే సర్కారు సన్నద్దం కావడం విశేషం.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement