40 ఏళ్ల ఆమె.. 22 ఏళ్ల అతడు.. సీక్రెట్‌గా అలా పట్టుబడి.. | Varanasi 40 Year Old Woman And Lover Viral Video | Sakshi
Sakshi News home page

40 ఏళ్ల ఆమె.. 22 ఏళ్ల అతడు.. సీక్రెట్‌గా అలా పట్టుబడి..

Oct 4 2026 12:41 PM | Updated on Oct 4 2026 12:59 PM

 Varanasi 40 Year Old Woman And Lover Viral Video

‘ప్రేమకు వయసుతో పనేముంది.. మనసులు కలిస్తే చాలు’ అన్నట్టుగా మారిన ఓ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో కలకలం రేపింది. ‘ప్రేమ గుడ్డిదైతే.. లోకం ఏం చెప్పినా లెక్కే ఉండదు’ అన్నట్టుగా 40 ఏళ్ల మహిళ.. 22 ఏళ్ల యువకుడితో కలిసి వెళ్లేందుకు ప్రయత్నించడం స్థానికంగా చర్చనీయాంశమైంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

వారణాసిలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. వీడియో ప్రకారం.. ఆ మహిళ, తనకంటే చాలా చిన్న వయసున్న యువకుడితో కలిసి అక్కడి నుంచి వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా స్థానికులు గుర్తించినట్లు సమాచారం. ఇద్దరినీ ఆపడంతో అక్కడ ఒక్కసారిగా జనాలు గుమిగూడారు. ఏం జరుగుతుందోనని చుట్టుపక్కల వారు ఆసక్తిగా చూడగా.. కొందరు ఈ ఘటనను వీడియోలో చిత్రీకరించారు. అసలు ట్విస్ట్‌ అక్కడే మొదలైంది. అందరి ముందు ఆమె తన మనసులో మాటను ఎలాంటి సంకోచం లేకుండా చెప్పేసింది. అతడు లేకుండా నేను జీవించలేను అంటూ తన ప్రేమను బహిరంగంగా ప్రకటించింది. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు.

 

‘మనసుంటే మార్గం ఉంటుంది’ అన్న సామెతను గుర్తు చేసేలా.. వయసు, సమాజం ఏమనుకుంటుందన్న విషయాల కంటే తనకు అతడితో ఉండటమే ముఖ్యమని ఆమె చెప్పినట్లు తెలుస్తోంది. ఈ సన్నివేశానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మహిళ మాట్లాడుతున్న తీరు, తన ప్రేమపై ఆమె వ్యక్తం చేసిన నమ్మకం నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. దీంతో ఈ ఘటనపై సోషల్‌ మీడియాలో భిన్నమైన స్పందనలు వస్తున్నాయి.

‘ఆమెకు దక్కని ప్రేమ, ఆప్యాయతను అతడి నుంచి పొందిందేమో’ అంటూ ఓ నెటిజన్‌ స్పందించగా.. మరో వ్యక్తి ‘వారి నిర్ణయానికి మద్దతు ఇస్తున్నా’ అని కామెంట్‌ చేశాడు. ఇంకొందరు వారి ధైర్యాన్ని ప్రశంసిస్తూ స్పందించారు. అయితే ఈ ఘటనలో పాల్గొన్న మహిళ, యువకుడి పేర్లు అధికారికంగా వెల్లడికాలేదు. స్థానికులు వారిని అడ్డుకున్న పరిస్థితులు, ఆ తర్వాత ఏం జరిగిందన్న దానిపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement