తమిళనాడు రాజకీయాల్లో బిగ్‌ ట్విస్ట్‌ | tamilnadu anbumani calls on father and pmk founder ramadoss | Sakshi
Sakshi News home page

తమిళనాడు రాజకీయాల్లో బిగ్‌ ట్విస్ట్‌

Jun 24 2026 7:22 PM | Updated on Jun 24 2026 7:46 PM

tamilnadu anbumani calls on father and pmk founder ramadoss

చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో మరో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. గత కొంతకాలంగా పట్టాళి మక్కల్ కట్చి (PMK)పార్టీలో అంతర్గత కలహాలు కొనసాగతున్నవేళ ఎట్టకేలకు ఈ రోజు బుధవారం ఆ పార్టీ అధ్యక్షుడు అన్బుమణి రాందాస్,  తన తండ్రి, పార్టీ వ్యవస్థాపకుడు ఎస్. రాందాస్‌ను కలిశారు. వివాహ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలపడానికి వచ్చానన్నారు. ఈ సందర్బంగా ఎస్. రాందాస్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.

పీఎంకే (PMK) పార్టీలో  2024 డిసెంబర్‌లో అంతర్గత విభేదాలు బహిర్గతమయ్యాయి. పార్టీ వ్యవస్థాపకుడు డా. ఎస్. రామదాస్  ఆయన కుమారుడు ప్రస్తుత పార్టీ అధ్యక్షుడు డా.అన్బుమణి రామదాస్ మధ్య తలెత్తిన అధిపత్యం విషయమై తలెత్తిన వివాదం పార్టీ చీలికకు దారితీసింది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం  డా. అన్బుమణి రామదాస్ నేతృత్వాన్ని గుర్తించి పార్టీ అధికారిక పేరు ‘పాట్టాలి మక్కల్ కట్చి’ (PMK) దాని ప్రధాన గుర్తును ఆయనకు కేటాయించాయి.

ఈ రాజకీయ ఉద్రిక్తలను నడుమ ఈ రోజు తన తండ్రి ఎస్. రామదాస్‌ను విల్లుపురం జిల్లాలోని తిండివనం సమీపంలో ఉన్న తైలపురంలోని తమ కుటుంబ నివాసంలో డా. అన్బుమణి రాందాస్ కలిశారు. తమ తల్లిదండ్రుల 61వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ "నా తల్లిదండ్రుల వివాహ వార్షికోత్సవం రోజున వారి ఆశీస్సులు తీసుకోవడానికే థైలాపురం వచ్చాను. ఇకపై మంచి విషయాలే జరుగుతాయి" అని ఆయన పేర్కొన్నారు.

కాగా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్టీ రెండు వర్గాలుగా పోటీ చేసింది – కొడుకు నేతృత్వంలోని ఒక వర్గం నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) లో భాగం కాగా, తండ్రి నేతృత్వంలోని మరో వర్గం వి.కె. శశికళ నేతృత్వంలోని కూటమితో జతకట్టింది. ఈ ఎన్నికల్లో అన్బుమణి వర్గం నాలుగు స్థానాలను గెలుచుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement