విజయ్ సర్కార్ సంచలన నిర్ణయం | vijay state song challenge amid centre vande mataram | Sakshi
Sakshi News home page

విజయ్ సర్కార్ సంచలన నిర్ణయం

Aug 10 2026 2:56 PM | Updated on Aug 10 2026 3:46 PM

vijay state song challenge amid centre vande mataram

చెన్నై: విజయ్‌ ప్రభుత్వం కీలక చట్టం చేసింది. అసెంబ్లీతో పాటు ఇతర ఏ ప్రభుత్వ కార్యక్రమాలలోనైనా రాష్ట్ర గీతం ‘తమిళ్ తాయ్ వాజ్తు’ను  తప్పనిసరిగా ముందుగా ఆలపించాలని నిబంధనలు చేస్తూ చట్టం చేసింది. ఈ తీర్మానాన్ని డీఎంకే, ఏఐడీఎంకేతో పాటు ఇతర పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదించాయి. ఇటీవలే వందేమాతరంపై ప్రత్యేక చట్టం తీసుకవచ్చిన నేపథ్యంలో ఈ చట్టం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
 

ఈ అంశమై తమిళనాడు స్పీకర్  జేసీడీ ప్రభాకర్ మాట్లాడుతూ తీర్మానం ఆమోదించబడిందని తెలిపారు. దీని అమలుకు ఇక ఎలాంటి అదనపు అనుమతి అవసరం లేదని పేర్కొన్నారు. ఈ తీర్మానం ప్రకారం విద్యాసంస్థలు. విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ రంగ సంస్థలు వంటి అనేక చోట్ల జరిగే అధికారిక కార్యక్రమాల ప్రారంభంలో తమిళ్ తాయ్ వాజ్త్తును మొదటగా ఆలపించాలి.

సీఎం విజయ్ మాట్లాడుతూ రాష్ట్రంలో తమిళ గీతానికే తొలి ప్రాధాన్యత ఉండాలని సీఎం విజయ్‌ స్పష్టం చేశారు. రాష్ట్ర భాషా హక్కులు, సాంస్కృతిక హక్కుల విషయంలో తమ ప్రభుత్వం ఎలాంటి రాజీకి వెళ్లబోదన్నారు. ఈ అంశంపై అసెంబ్లీలో ఉద్వేగభరితంగా ప్రసంగించిస్తూ " తమిళం ఒక భాష మాత్రమే కాదు.. మా జీవనాడి  మా భావోద్వేగం. మాతృభాష ఎంత పవిత్రమో, తల్లి ఎంత పవిత్రమో తమిళం కూడా అంతే పవిత్రమైనది తమిళం అంటే గర్వం. తమిళం అంటే శక్తి. ‘తమిళం’ అనే మాట వినగానే తమిళనాడు మొత్తం ఒక్కటై నిలబడుతుంది. తమిళ్ తాయ్ వాజ్తుకు తమిళనాడులో మొదటి స్థానం ఉండాలి. తమిళ్ తాయ్ వాజ్తుకు తొలి స్థానం ఇవ్వడం మా హక్కు” అని విజయ్ పేర్కొన్నారు.

కాగా ఇటీవల తమిళ రాష్ట్ర గీతం అధికారిక కార్యక్రమాల్లో చివరగా పాడడంతో వివాదం చెలరేగింది. ఈ ఏడాది మేలో ఒక విశ్వవిద్యాలయ  కార్యక్రమంలో తొలుత జాతీయ గీతం, ఆ తర్వాత జాతీయ జాతీయ గీతం ఆలపించి, చివరగా తమిళ్ తాయ్ వాజ్తును ఆలపించారు. దీంతో వివాదం చెలరేగింది.

అనంతరం కొన్ని వారాల తర్వాత విజయ్ పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో కూడా తమిళ్ తాయ్ వాజ్తు మూడో స్థానానికి వెళ్లింది. దీంతో దీనిపై రాజకీయంగా దుమారం చెలరేగింది. దీనిపై గవర్నర్‌కు 21 మంది ఎంపీల లేఖఅధికారిక కార్యక్రమాల్లో రాష్ట్ర గీతమైన తమిళ్ తాయ్ వాజ్తును మొదటగా, జాతీయ గీతాన్ని కార్యక్రమం చివరలో ఆలపించేలా ఆదేశాలు జారీ చేయాలని వారు గవర్నర్‌ను కోరారు.

CM విజయ్ సంచలనం అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం

ఈ పరిణామాలన్నింటి మధ్య ఇప్పుడు తమిళనాడు అసెంబ్లీ తమిళ్ తాయ్ వాజ్త్తుకు రాష్ట్రంలో మొదటి ప్రాధాన్యత కల్పిస్తూ ఏకగ్రీవంగా తీర్మానం చేయడం పొలిటికల్ హీట్‌గా మారింది.
  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement