తిరుగుబాటు ఎంపీల లేఖ ఇవ్వండి  | Shiv Sena-UBT MPs to meet Lok Sabha Speaker Om Birla | Sakshi
Sakshi News home page

తిరుగుబాటు ఎంపీల లేఖ ఇవ్వండి 

Jun 25 2026 2:03 AM | Updated on Jun 25 2026 2:03 AM

Shiv Sena-UBT MPs to meet Lok Sabha Speaker Om Birla

స్పీకర్‌ ఓం బిర్లాను కోరిన ఉద్ధవ్‌ సేన 

న్యూఢిల్లీ: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏకనాథ్‌ షిండే వర్గంలో చేరిన తమ పార్టీకి చెందిన ఆరుగురు తిరుగుబాటు ఎంపీలు సమర్పించిన వినతిపత్రం ప్రతులను తమకు అందజేయాలని శివసేన (యూబీటీ) లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాను కోరింది. బుధవారం సాయంత్రం స్పీకర్‌తో భేటీ అయిన అనంతరం ఆ పార్టీ ఎంపీలు అనిల్‌ దేశాయ్, అరవింద్‌ సావంత్‌ విలేకరులతో మాట్లాడారు. 

రాజ్యాంగ నిబంధనలను నిలబెట్టాలని స్పీకర్‌ను అభ్యర్థించామని, తిరుగుబాటుదారులు ఇచ్చిన డిమాండ్ల ప్రతి ఇవ్వాలని కోరామని వారు వెల్లడించారు. రెబెల్స్‌ నుంచి ఇప్పటివరకు లిఖితపూర్వకంగా ఎలాంటి లేఖ అందలేదని స్పీకర్‌ చెప్పారని అరవింద్‌ సావంత్‌ పేర్కొన్నారు. ఒకవేళ రెబల్‌ ఎంపీలు తన కార్యాలయానికి ఏవైనా పత్రాలు సమర్పించి ఉంటే, ఆ వివరాలను పరిశీలించి అప్‌డేట్‌ ఇస్తానని స్పీకర్‌ హామీ ఇచ్చారని దేశాయ్‌ పేర్కొన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement