ఉప ఎన్నికల కౌంటింగ్.. తమిళనాడులో దూసుకెళ్తున్న టీవీకే! | Ruling TVK dominates Tamil Nadu by-elections | Sakshi
Sakshi News home page

ఉప ఎన్నికల కౌంటింగ్.. తమిళనాడులో దూసుకెళ్తున్న టీవీకే!

Oct 9 2026 2:28 PM | Updated on Oct 9 2026 2:40 PM

Ruling TVK dominates Tamil Nadu by-elections

సాక్షి,చెన్నై: దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తిస్తున్న ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. అసోంలోని నాగావ్‌ లోక్‌సభ స్థానంతో పాటు, పశ్చిమ బెంగాల్‌, తమిళనాడులోని పలు అసెంబ్లీ స్థానాల్లో ప్రధాన పార్టీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది.

ముఖ్యంగా తమిళనాడులో అధికార టీవీకే పార్టీ హవా స్పష్టంగా కనిపిస్తోంది. రాష్ట్రంలో పోటీ జరుగుతున్న కీలక స్థానాల్లో టీవీకే అభ్యర్థులు ఘన విజయం దిశగా దూసుకెళ్తున్నారు. మదురాంతకంలో టీవీకే అభ్యర్థి మరగతం కుమరవేల్‌ తన సమీప ప్రత్యర్థిపై సుమారు 10వేల ఓట్ల ఆధిక్యంలో, ధారాపురంలో టీవీకే అభ్యర్ధి పి. సత్యభామ 9500 ఓ‍ట్ల ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు. 

ఈ అనూహ్య ఆధిక్యాలతో తమిళనాడు వ్యాప్తంగా ఉన్న టీవీకే శ్రేణులు, కార్యకర్తలు భారీ ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. పార్టీ కార్యాలయాల వద్ద బాణాసంచా కాల్చి, మిఠాయిలు పంచుకుంటూ ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు. తుది ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement