‘కంగన’కు చెంపదెబ్బపై పంజాబ్‌ సీఎం కీలక కామెంట్స్‌ | Punjab Cm Bagavanthman Responded On Slap On Kangana | Sakshi
Sakshi News home page

తప్పుడు మాటల వల్లే.. ‘కంగన’ ఘటనపై స్పందించిన పంజాబ్‌ సీఎం

Jun 10 2024 7:46 PM | Updated on Jun 10 2024 8:07 PM

Punjab Cm Bagavanthman Responded On Slap On Kangana

చండీగఢ్‌: బాలీవుడ్‌ సీనియర్‌ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌ను సీఐఎస్‌ఎఫ్‌ మహిళా కానిస్టేబుల్‌ చెంప దెబ్బ కొట్టిన ఘటనపై పంజాబ్‌ సీఎం భగవంత్‌మాన్‌ స్పందించారు. పంజాబ్‌ రైతుల పోరాటంపై కంగన చేసిన వ్యాఖ్యల వల్లే ఆమెను కానిస్టేబుల్‌ కొట్టిందని చెప్పారు.

‘అది కోపం. కంగన గతంలో మాట్లాడిన మాటలే కానిస్టేబుల్‌ను ఆగ్రహానికి గురి చేశాయి. ఇది జరగకుండా ఉండాల్సింది. ఆమె అలా మాట్లాడటం తప్పు’భగవంత్‌మాన్‌ మీడియాతో చెప్పారు.  

జూన్‌6వ తేదీన కంగన చండీగఢ్‌ ఎయిర్‌పోర్టులో సెక్యూరిటీ చెక్‌కు వెళ్లినపుడు అక్కడున్న కానిస్టేబుల్‌ కుల్విందర్‌‌ కౌర్‌ ఆమెను చెంపపై కొట్టింది. రైతుల పోరాటంలో తన తల్లి పాల్గొందని, ఆ పోరాటాన్ని కంగన కించపరిచినందుకే కొట్టానని తెలిపింది.      

 

Advertisement
 
Advertisement
Advertisement