యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తాం
ప్రధాని నరేంద్ర మోదీ హామీ
స్పేస్ స్టార్టప్‌ల వ్యవస్థాపకులు, సీఈఓలతో భేటీ
న్యూఢిల్లీ: స్పేస్ స్టార్టప్‌లకు ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. ఆయా స్టార్టప్‌లను నిర్వహించే యువ పారిశ్రామికవేత్తలను మరింత ప్రోత్సహిస్తామని ప్రకటించారు. వ్యవసాయం, పశుసంపద, పాడి, పర్యావ రణం, ప్రజల దైనందిన జీవితాలను ప్రభా వితం చేసే రంగాల్లో అంతరిక్ష సాంకేతికతను ఎలా ఉపయోగించాలన్న దానిపై అన్వేషణ సాగించాలని వారిని కోరారు.
20 స్పేస్ స్టార్టప్‌ల వ్యవస్థాపకులు, సీఈఓలతో ప్రధాని మోదీ శుక్రవారం సమావేశమ య్యారు. అంతరిక్ష స్టార్టప్‌ల వంటి నూతన, సవాలుతో కూడిన రంగంలోకి ప్రవేశించి, రిస్కులు తీసుకుని, ప్రభుత్వ సంస్కరణల ప్రక్రియను విశ్వసించి, ప్రయత్నాలను నిలకడగా కొనసాగిస్తున్నందుకు వారిని ప్రశంసించారు.
ఈ రంగంలో విజయాలు సాధించడానికి అన్ని విధాలుగా మద్దతు ఇస్తామని పేర్కొన్నారు. అలాగే, అంతరిక్ష సాంకేతికతల వినియోగాన్ని విస్తరించేందుకు అంతరిక్ష రంగ సంస్థలు, ఇతర రంగాల్లోని సంస్థల మధ్య మరింత సహకారం ఉండాలని అభిప్రా యపడ్డారు.
అంతరిక్ష రంగంలో ప్రపంచానికి ఒక బలమైన, వినూత్నమైన, వాణిజ్యపరంగా ఆచరణీయమైన నమూనాను భారత్ అందించగలదని మోదీ స్పష్టంచేశారు. అంతరిక్షం నుంచి వచ్చే శిథిలాలపై పరిశో« దిస్తున్న కంపెనీలు తమ సాంకేతికతలను విస్తరించడానికి పర్యావరణ సంస్థలతో కలిసి పనిచేయవచ్చని ప్రధానమంత్రి సూచించారు. వ్యవసాయ రంగంతో కలిసి పని చేస్తున్న స్పేస్ టెక్నాలజీ కంపెనీలు వ్యవ సాయ విశ్వవిద్యాలయాలు, విభాగాలతో సమన్వయం చేసుకోవచ్చని అన్నారు.
తద్వారా రైతులు మరింత సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకోవడానికి , వారి ఉత్పత్తిని గరిష్ఠ స్థాయికి పెంచుకోవడానికి వీలవుతుందని వెల్లడించారు. స్టార్టప్‌లు తమ కార్యకలాపాలపై అర్థవంతమైన ప్రజెంటేషన్లు ఇచ్చాయని, అలాగే ప్రభుత్వం చేపట్టిన అంతరిక్ష రంగ సంస్కరణలను, ఆ రంగం వృద్ధికి కల్పించిన అవకాశాలను అవి ప్రశంసించాయని ప్రధానమంత్రి పేర్కొ న్నారు. యువ పారిశ్రామికవేత్తల కృషి వల్ల అంతరిక్ష రంగంలో భారత్ ఎన్నో ఘనతలు సాధించిందని హర్షం వ్యక్తంచేశారు.


