‘భారత్‌కు ఒక్క చుక్క నీటినీ ఇవ్వం’.. మళ్లీ పాక్‌ తాటాకు చప్పుళ్లు | Pakistan PM Shehbaz Sharif Threatens India Over Indus Waters Treaty, Watch Video To Know His Comments | Sakshi
Sakshi News home page

‘భారత్‌కు ఒక్క చుక్క నీటినీ ఇవ్వం’.. మళ్లీ పాక్‌ తాటాకు చప్పుళ్లు

Aug 13 2025 8:06 AM | Updated on Aug 13 2025 10:06 AM

Pakistan PM Shehbaz Sharif Threatens India Over Indus Waters Treaty

న్యూఢిల్లీ: సింధు జలాల ఒప్పందంపై పాక్‌  ప్రధాని షెహబాజ్ షరీఫ్  సంచలన వ్యాఖ్యలు చేశారు. సింధు నదిలోని ఒక్క చుక్క నీటిని కూడా భారత్‌కు ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ తమ శత్రు దేశం.. సింధునదిలోని ఒక్క చుక్కనీటిని లాక్కున్నా  సహించేది లేదన్నారు.

జమ్ముకశ్మీర్‌లోని  పహల్గామ్‌లో జరిగిన ఉగ్ర దాడి తర్వాత ఏప్రిల్ 23న భారత్‌ 1960 నాటి సింధు జలాల ఒప్పందాన్ని (ఐడబ్యూటీ)నిలిపివేసింది. ఈ నేపధ్యంలో ఇదే నీటిపై ఆధారపడిన పాక్‌.. సింధు ప్రవాహాన్ని అడ్డుకునే ఏ ప్రయత్నమైనా యుద్ధ చర్యగా పరిగణిస్తామని పేర్కొంది. తాజాగా ఇస్లామాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో పాక్‌ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ‘మీరు మా నీటిని నిలిపివేస్తామని బెదిరిస్తే, పాకిస్తాన్ నుండి ఒక్క చుక్క నీటిని కూడా లాక్కోలేరని గుర్తుంచుకోండి.అలాంటి చర్యకు ప్రయత్నిస్తే, మీకు మళ్లీ గుణపాఠం చెబుతామని, అప్పుడు మీరు మీ చెవులు పట్టుకోవాల్సి వస్తుందని’  హెచ్చరించారు.
 

షెహబాజ్ షరీఫ్ వ్యాఖ్యలపై భారత్‌ ఇంకా స్పందించలేదు. కాగా పాక్‌ మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ ఇటీవల.. సింధు జలాల ఒప్పందం రద్దును సింధు నాగరికతపై దాడిగా అభివర్ణిస్తూ, ఈ విషయంలో భారత్‌.. పాకిస్తాన్‌ను యుద్ధ పరిస్థితుల్లోకి నెట్టివస్తే.. వెనక్కి తగ్గేది లేదన్నారు. ఇదే అంశంపై స్పందించిన పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్.. పాకిస్తాన్‌కు నీటి ప్రవాహాన్ని నిలిపివేసే ఏ ఆనకట్టనైనా ఇస్లామాబాద్‌ ధ్వంసం చేస్తుందని వ్యాఖ్యానించారు.భారత్‌ ఆనకట్ట నిర్మించే వరకు వేచి చూస్తామని, తరువాత దానిని నాశనం చేస్తామని హెచ్చరించినట్లు డాన్ వార్తాపత్రిక పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement