ధర్నా @ రాజ్‌ఘాట్‌ | Opposition MPs Protest at Rajghat Demanding Resignation of CEC Gyanesh Kumar | Sakshi
Sakshi News home page

ధర్నా @ రాజ్‌ఘాట్‌

Oct 9 2026 5:29 AM | Updated on Oct 9 2026 5:29 AM

Opposition MPs Protest at Rajghat Demanding Resignation of CEC Gyanesh Kumar

మూడోరోజు శాంతియుత పోరుబాటలో విపక్ష నేతలు

దిక్కులు పిక్కటిల్లే నినాదాలకు బదులు మౌనంగా కొనసాగిన ఉద్యమం 

రాజ్‌ఘాట్‌లో గాంధీజీకి నివాళులరి్పంచి శాంతియుత నిరసనలో పాల్గొన్న విపక్ష ఎంపీలు 

ఓట్ల చోరీకి పాల్పడిన బీజేపీ సర్కార్, సీఈసీకి ఇకనైనా జ్ఞానోదయం కావాలని ప్రార్థన 

శుక్రవారమూ కొనసాగనున్న విపక్షాల ‘సీఈసీ జ్ఞానేశ్‌ రాజీనామా డిమాండ్‌’ ఉద్యమం 

నేడో, రేపో రాష్ట్రపతిని కలిసి వినతిపత్రం ఇవ్వనున్న కూటమి నేతలు 

రోడ్డుపై ధర్నా ఘటనపై రాహుల్, ప్రియాంకా గాందీలపై ఎఫ్‌ఐఆర్‌

న్యూఢిల్లీ: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్‌) మాటున గంపగుత్తగా కోట్లాది ఓటర్ల ఓటు హక్కును హరించి ప్రజాస్వామ్యాన్ని పరిహసించిన ప్రధాన ఎన్నికల కమిషనర్‌(సీఈసీ) జ్ఞానేశ్‌ రాజీనామా డిమాండ్‌తో గత రెండ్రోజులుగా రాజధాని రహదారులపై ఉద్యమించి నినాదాలతో హోరెత్తించిన విపక్షాల ‘ఇండియా’కూటమి నేతలు ఒక్కసారిగా తమ ఉద్యమపంథాను మార్చారు. గాందీజీ స్ఫూర్తితో మౌనంగా తమ నిరసనను తెలపాలని నిర్ణయించుకుని శాంతియుతంగా నిరసనోద్యమాన్ని ముందుకు నడిపించారు. 

మంగళవారం ఆకాశవాణి ప్రాంగణంలో, బుధవారం నడిరోడ్డుపై హైడ్రామా కొనసాగిన విపక్ష ఎంపీల ఉద్యమం గురువారం గాందీజీ స్మారకం రాజ్‌ఘాట్‌ వేదికగా కొనసాగింది. గత రెండ్రోజులుగా కాంగ్రెస్, ఆర్జేడీ, తృణమూల్‌ కాంగ్రెస్‌ తదితర మిత్రపక్షాల ఎంపీలు, మద్దతుదారులు, కార్యకర్తలు త్రివర్ణపతాకాలు చేతబూని కీలక పార్లమెంట్‌ పరిసరాల్లో నడిరోడ్లపై చేసిన నిరసనోద్యమాన్ని కట్టడిచేసేందుకు చెమటోడ్చిన ఢిల్లీ పోలీసులు గురువారం కాస్తంత ఊపిరిపీల్చుకున్నారు. అయితే శుక్రవారం మళ్లీ ఉద్యమంలో కదంతొక్కుతామన్న విపక్ష నేతల ప్రతిజ్ఞతో పోలీసుల మొహరింపు, అప్రమత్తత సెంట్రల్‌ ఢిల్లీలో రాజ్యమేలుతోంది. 

మళ్లీ ఖర్గే భేటీతో మొదలై.. 
బుధవారం మాదిరే గురువారం సైతం విపక్షాల ఎంపీలందరికీ కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే మధ్యాహ్నం భోజనానికి ఆహా్వనించారు. దీంతో కాంగ్రెస్, తదితర మిత్రపక్షాల ఎంపీలంతా కన్నాట్‌ ప్లేస్‌లోని ఔటర్‌ సర్కిల్‌ మొయిట్స్‌ రెస్టారెంట్‌లో భేటీ అయి భోజనం పూర్తిచేశారు. ముందుజాగ్రత్తగా పోలీసులు ఆ ప్రాంతంలో మొహరించి సిద్ధంగా ఉన్నారు. వాళ్ల అంచనాలను తలకిందులు చేస్తూ ఖర్గే ఈరోజు రహదారిలో పోరాటం చేయట్లేదని, నేరుగా రాజ్‌ఘాట్‌కు వెళ్లి అక్కడ శాంతియుతంగా ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టంచేశారు. దీంతో ఎంపీలతో బస్సుల్లో బయల్దేరారు. 

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాందీ, టీఎంసీ ఎంపీలు అభిషేక్‌ బెనర్జీ, మేనకా గురుస్వామి, సాకేత్‌ గోఖలే, సమీరుల్‌ ఇస్లాం, ఎస్పీ పార్లమెంట్‌ సభ్యులు రాజీవ్‌ రాయ్, మొహీబుల్లాహ్, సీపీఐఎం ఎంపీ జాన్‌ బ్రిటాస్, సీపీఐ ఎంపీ సందోశ్, ఆర్జేడీ నేత సుధాకర్‌ సింగ్‌ తదితరులూ బస్సుల్లో బయల్దేరారు. కొందరు నేతలు బస్సుల పైకి ఎక్కి త్రివర్ణపతాకం చేతబూనారు. వీళ్ల బస్సులను కాంగ్రెస్‌ మద్దతుదారులు అనుసరించారు. ముఖ్యనేతలు మౌనంగా ఉండిపోయినా కార్యకర్తలు మాత్రం నినాదాలు ఇచ్చారు. యువజన కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ, వామపక్ష సంఘాల సభ్యులు వెంట నడిచారు. మింటో రోడ్, ఆసిఫ్‌ అలీ రోడ్‌ దాటుకుని ఢిల్లీగేట్, డిలైట్‌ సినిమా మీదుగా రాజ్‌ఘాట్‌కు శాంతియుత ర్యాలీ కొనసాగింది. ర్యాలీ చాలా నెమ్మదిగా సాగడంతో ఐదు కిలోమీటర్ల దూరం వెళ్లడానికి దాదాపు రెండు గంటల సమయం పట్టింది. 

ఆ ముగ్గురికీ జ్ఞానం ప్రసాదించండి.. 
రాజ్‌ఘాట్‌లో మహాత్ముని స్మారకం వద్ద ఖర్గే, రాహుల్, ప్రియాంక, అభిõÙక్‌బెనర్జీ, మహువా మొయిత్రా, ఇమ్రాన్‌ ప్రతాప్‌గఢీ, రాజీవ్‌ శుక్లా, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, దీపేందర్‌ హూడా తదితర నేతలు తొలుత అంజలి ఘటించారు. ఎస్‌ఐఆర్‌ పేరిట ఓట్ల తొలగింపు, అక్రమాలతో ఓట్ల చోరీ వంటి పాపాలు చేయకుండా బీజేపీ ప్రభుత్వానికి, సీఈసీ జ్ఞానేశ్‌కు జ్ఞానోదయం కలిగేలా చేయాలని విపక్ష నేతలు ప్రారి్థంచారు. తర్వాత అక్కడి ప్రాంగణంలో నేలపై కూర్చుని మౌనంగా నిరసన కొనసాగించారు. రాహుల్‌ తదితరులు కొంతసేపు మౌనముద్రలో ఉండిపోయారు.

 తిరుగుపయనమయ్యేటపుడు ఖర్గే మీడియాలో మాట్లాడారు. ‘‘ప్రభుత్వం ఇప్పటికైనా జ్ఞానం తెచ్చుకుంటుందని ఆశిస్తూ అందరం ప్రార్థనలుచేశాం. ఇకనైనా ఓట్ల చోరీ ఆగిపోవాలి. తప్పులు చేసిన వాళ్లు రాజీనామా చేసి ప్రాయశ్చిత్తంచేసుకోవాలి. ఓటేసే హక్కును మోదీ ప్రభుత్వం అక్రమంగా లాక్కుంటోంది. గొప్ప నేతలు గాంధీజీ, నెహ్రూ, సర్దార్‌ పటేల్‌ సాధించిన హక్కును ఇప్పుడొచ్చి వీళ్లు లాగేసుకుంటున్నారు. దేశాన్ని హైజాక్‌ చేస్తున్న మోదీ, షా, జ్ఞానేశ్‌ల నేరపూరిత కుట్రను భారత పౌరులకు గాందీజీ సాక్షిగా తెలియజెప్పేందుకు ఇక్కడికొచ్చాం’’అని ఖర్గే అన్నారు. 

రాష్ట్రపతిని కలిసి ఫిర్యాదు చేస్తాం.. 
అంతకుముందు కాంగ్రెస్‌ నేత కేసీ వేణుగోపాల్‌ మాట్లాడారు. ‘‘గాందీజయంతి రోజునే రాష్ట్రపతిని కలిసేందుకు విజ్ఞప్తిచేశాం. భేటీకొచ్చేవాళ్ల అందరి పేర్లు ముందే చెప్పాలన్నారు. పేర్లతో ఐదోతేదీన మళ్లీ అభ్యరి్థంచాం. నేడో, రేపో పిలుపు రావొచ్చు. రాష్ట్రపతి ముర్మును కలిసి స్వయంగా ప్రస్తుత ఓట్ల దారుణోదంతాన్ని వివరిస్తాం’’అని తెలిపారు. అంతకుముందు రాజ్‌ఘాట్‌కు బస్సులో వచ్చేటప్పుడు రాహుల్‌ ఒక వీడియో సందేశం ‘ఎక్స్‌’లో విడుదలచేశారు. ‘‘గత 10–15 ఏళ్లలో ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్యం అమలు, రాజ్యాంగం దారుణంగా దెబ్బతిన్నాయి. ఇప్పుడు రాజకీయ చైతన్యం మొదలైంది. త్వరలోనే ప్రభుత్వాలు మారతాయి.

 అప్పుడు అసలైన దర్యాప్తు ఆరంభమవుతుంది. దోషులుగా తేలితే మోదీ, షా, మోహన్‌ భాగవత్, వీళ్ల తోటి నేరస్తులకు కఠిన శిక్షలు పడతాయి’’అని అన్నారు. తర్వాత రాజ్‌ఘాట్‌ వద్ద రాహుల్‌ మాట్లాడారు. ‘‘ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటున్న మోదీ, షా, జ్ఞానేశ్‌ త్రయాన్ని చట్టం ముందు నిలబెడతా. ఇదే నా వాగ్దానం’’అని అన్నారు. శుక్రవారం మరో తరహాలో ఉద్యమం కొనసాగుతుందని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ వెల్లడించారు. మరోవైపు బుధవారం ధర్నాకు సంబంధించి రాహుల్, ప్రియాంకలపై ఢిల్లీలో గురువారం ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది.

నేడు పార్లమెంట్‌ హౌస్‌లో భేటీ
శుక్రవారం ఉదయం పార్లమెంట్‌ హౌస్‌లో విపక్ష ఎంపీలు భేటీ అయి తదుపరి కార్యాచరణ ఖరారుచేసే ఆస్కారముంది. ముందే పిలుపొస్తే రాష్ట్రపతిభవన్‌కు వెళ్లి వినతిపత్రం సమరి్పంచే వీలుంది. శుక్రవారం భేటీలో టీఎంసీ చీఫ్‌ మమతా బెనర్జీ, సమాజ్‌వాదీ పార్టీ నేత రాంగోపాలయాదవ్‌ పాల్గొనే అవకాశం ఉంది. గురువారం రాజ్‌ఘాట్‌కు మమత రావాల్సి ఉంది. అయితే ఆమె ప్రయాణించాల్సిన విమానానికి బాంబు బెదిరింపు రావడంతో ఆమె రాక చాలా ఆలస్యమైంది. శివసేన(యూబీటీ), శరద్‌పవార్‌ సారథ్యంలోని ఎన్సీపీ(ఎస్పీ)లు గురువారం నిరసనలో పాల్గొనలేదు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement