భారీ వర్షాలకు కేరళ అతలాకుతలం | Monsoon Rains Weather Kerala | Sakshi
Sakshi News home page

భారీ వర్షాలకు కేరళ అతలాకుతలం

May 30 2025 12:49 PM | Updated on May 30 2025 1:05 PM

Monsoon Rains Weather Kerala

తిరువనంతపురం: అత్యంత భారీ వర్షాలు, విపరీతమైన వేగంతో కూడిన ఈదురు గాలులు కేరళ(Kerala)ను అతలాకుతలం చేస్తున్నాయి. ఈ బీభత్సం కొనసాగుతున్న సమయంలోనే రాబోయే మూడు గంటల్లో కేరళలోని 5 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందంటా వాతావరణశాఖ రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది.

కేరళలోని అలప్పుజ, కొట్టాయం, ఎర్నాకులం, త్రిస్సూర్, పాలక్కాడ్ జిల్లాలకు వాతావరణశాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. రాబోయే మూడు గంటల్లో ఉరుములతో కూడిన భారీ వర్షాలు, కొన్ని ప్రదేశాలలో 60 కి.మీ వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని తెలియజేసింది. తిరువనంతపురం(Thiruvananthapuram), కొల్లం, పతనంతిట్ట, ఇడుక్కి, మలప్పురం, కోజికోడ్, వయనాడ్, కన్నూర్ , కాసరగోడ్ జిల్లాలలోనూ వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

ప్రజలు అత్యవసర పరిస్థితుల్లోనే బయటకు వెళ్లాలని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. భారీ వర్షాలకు చెట్లు పడిపోయే అవకాశం ఉందని, విద్యుత్ వైర్లు తెగిపడవచ్చని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ప్రమాదకరమైన విద్యుత్ లైన్లు గమనిస్తే ఈ విషయాన్ని విద్యుత్‌శాఖ సిబ్బందికి తెలియజేయాలని అధికారులు కోరారు.

ఇది కూడా చదవండి: ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ను సందర్శించిన రక్షణమంత్రి రాజ్‌నాథ్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement