
లక్నో: యువతి,యువకుడిపై అల్లరి మూకలు తెగబడ్డారు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు నిందితుల్ని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. ఆ క్రమంలో నిందితులు తాము అనారోగ్యంతో ఉన్నామంటూ పోలీసులకు కలరింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. కాలుతో కుంటుకుంటూ నడుస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ వీడియోలపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ట్రై చేస్తే మీకు ఖచ్చితంగా ఆస్కార్ అవార్డ్ వస్తుందంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇంతకి ఈ ఘటన ఎక్కడ జరిగింది?
ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్ నగర్ జిల్లాలో అల్లరి మూకలు వీరంగం సృష్టించారు. ఓ యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఆమె స్నేహితుడిపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడి అనంతరం బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదుతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుల్ని అరెస్ట్ చేశారు. పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
అదిగో అప్పుడే నిందితులు తమలోని నటులను బయటపెట్టారు. ఫిర్యాదు దారులే తమపై దాడి చేశారంటూ పోలీసుల వద్ద మొరపెట్టుకున్నారు. బలహీన స్థితిలో ఉన్నామంటూ నటించేందుకు ప్రయత్నించారు. కాలుతో కుంటుకుంటూ నడుస్తూ, యాక్టింగ్ చేస్తున్న దృశ్యాలు చూసిన నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ట్రై చేస్తే మీకు ఖచ్చితంగా ఆస్కార్ అవార్డ్ వచ్చేస్తుంది కావాలంటే ట్రై చేయండి అంటూ ట్రోలింగ్ చేస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం ఆస్కార్ అవార్డ్ రేంజ్ యాక్టింగ్‌తో పోలీస్ స్టేషన్‌లో అల్లరిమూకలు చేసిన స్టంట్ మీరూ చూసేయండి.
These men from UP's Muzaffarnagar misbehaved with a woman. They were caught by @Uppolice and took them to their acting class and were asked to perform in front of cameras.@Uppolice, you've become a joke! pic.twitter.com/vKLV3oxOM7
— Congress Kerala (@INCKerala) April 14, 2025