సాక్షి, హైదరాబాద్: అతడి పేరు సలీం హబీబ్ ఖురేషీ.. బాంబే సలీం, మున్నా అనే మారు పేర్లూ ఉన్నాయి. 53 ఏళ్ల వయసున్న ఈ ఘరానా దొంగపై దేశ వ్యాప్తంగా 200 కేసులు ఉన్నాయి. హైదరాబాద్‌కు చెందిన మహ్మద్ గౌస్ పాషా, ముంబైకి చెందిన సాబేర్‌లను అనుచరులుగా మార్చుకుని పంజా విసురుతున్నాడు. సాబేర్ మినహా మిగిలిన ఇద్దరినీ గోల్కొండ జోన్ టాస్‌్కఫోర్స్ పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. అతని నుంచి 220 గ్రాముల బంగారు ఆభరణాలు, 3.1 కేజీల వెండి సహా రూ.33.71 లక్షల విలువైన సొత్తు స్వా«దీనం చేసుకున్నట్లు అదనపు డీసీపీ అందె శ్రీనివాసరావు శుక్రవారం ప్రకటించారు.
ముంబైలోని గోవంది ప్రాంతంలోని టాటానగర్ స్లమ్‌లో ఉన్న డియోనార్ బుచ్చర్ హౌస్‌కు చెందిన సలీం ఆరో తరగతి వరకు చదివాడు. తొలినాళ్లలో ముంబైలో చిన్న చిన్న చోరీలు చేసినా 2000 నుంచి ఓ ముఠాను ఏర్పాటు చేసుకుని ఇళ్లల్లో దొంగతనాలు చేస్తున్నాడు. 2001లో ముంబైలోని చెంబూర్ ప్రాంతంలో రెక్కీ చేసిన బాంబే సలీం గ్యాంగ్ ఓ ఇంటిని టార్గెట్‌గా చేసుకుంది. అదేరోజు రాత్రి ఇంట్లోకి ప్రవేశించి చోరీ చేసింది. మర్నాడు పత్రికలు చూసిన సలీంకు.. తాము చోరీ చేసింది మాఫియా డాన్ ఛోటా రాజన్ ఇంట్లో అని, దొంగిలించిన సొత్తు విలువ దాదాపు రూ.9 కోట్ల వరకు ఉంటుందని తెలిసింది.
కొన్నాళ్ల తరవాత బాంబే సలీంను అరెస్టు చేసిన ముంబై పోలీసులు సొత్తు రికవరీ చేశారు. అయితే రాజన్ అనుచరుల నుంచి బెదిరింపులు రావడంతో.. బెయిల్‌పై వచి్చన వెంటనే వారిని సలీం కలిశాడు. జరిగింది చెప్పి ముంబై వదిలేస్తానని హామీ ఇచ్చి బయటపడ్డాడు. ముంబై నుంచి సలీం తన కుటుంబాన్ని బెంగళూరులోని పీన్యా సెకండ్ స్టేజ్‌లోని అత్తగారింటికి మార్చేశాడు. తాను కూడా అక్కడే ఉంటూ.. గ్యాంగ్‌ను వదిలి ఒంటరిగా పుణేలో పంజా విసరడం ప్రారంభించాడు. చోరీ సొత్తును బెంగళూరు తీసుకువచ్చి విక్రయించేవాడు. ఇతని కోసం తీవ్రంగా గాలించిన పుణే పోలీసులు బెంగళూరు అధికారుల సాయంతో 2011 ఫిబ్రవరిలో పట్టుకున్నారు. ఆపై తన ఇద్దరు భార్యలతో కలిసి హైదరాబాద్ వచ్చి వేర్వేరు ఇళ్లు తీసుకుని కాపురాలు పెట్టాడు. టోలిచౌకి ప్రాంతంలో ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ పెట్టి కొన్నాళ్లు నడిపాడు.
నష్టాలు రావడంతో మళ్లీ ముఠా కట్టి చోరీల బాటపడ్డాడు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 200కు పైగా నేరాలు చేశా>డు. బెంగళూరుకు చెందిన మహిళను మూడో పెళ్లి చేసుకుని అక్కడికి మకాం మార్చాడు. సలీం 2012 తర్వాత తన స్టైల్ పూర్తిగా మార్చేశాడు. టార్గెట్ చేసిన నగరానికి విమానంలో ప్రయాణించడం, అక్కడి సంపన్నుల ఇళ్లలో అనుచరులతో కలిసి చోరీలు చేయడం మొదలెట్టాడు. గోల్కొండ జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ ఆర్.వెంకటేష ఎస్‌ఐ జి.విజయానంద్‌లతో కూడిన బృందం గురువారం రాత్రి మల్లేపల్లి ఎక్స్ రోడ్ వద్ద సలీం, గౌస్‌లను పట్టుకుని సొత్తు స్వా«దీనం చేసుకుంది. నిందితుడిని హబీబ్‌నగర్ పోలీసులకు అప్పగించిన టాస్‌్కఫోర్స్.. పరారీలో ఉన్న సాబీర్ కోసం గాలిస్తోంది.


