పోలీసు క్యాంపుపై మావోయిస్టుల దాడి | Maoists Attack On Police Camp In Chhattisgarh | Sakshi
Sakshi News home page

Ch​​‍hattisgarh: పోలీసు క్యాంపుపై మావోయిస్టుల దాడి

Sep 14 2024 7:35 AM | Updated on Sep 14 2024 8:56 AM

Maoists Attack On Police Camp In Chhattisgarh

రాయ్‌పూర్‌:ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు పోలీసు క్యాంప్‌పై దాడి చేశారు. సుక్మా జిల్లాలోని జేగురుకొండ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో శుక్రవారం రాత్రి ఈ దాడి జరిగింది. భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని 15నుంచి 20 రౌండ్లు కాల్పులు జరిపారు. మావోయిస్టుల దాడిని భద్రతా బలగాలు తిప్పికొట్టాయి.

బలగాల ఎదురుదాడితో మావోయిస్టులు పారిపోయినట్లు సమాచారం. ఈ దాడిలో జవాన్ల వైపు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.30 నుంచి 40 మంది వరకు మావోయిస్టులు ఈ దాడిలో పాల్గొన్నట్లు సమాచారం.అరగంట పాటు మావోయిస్టులు, పోలీసుల మద్య కాల్పులు జరిగాయని తెలిపారు. 

ఇటీవలి కాలంలో ఛత్తీస్‌గఢ్‌లో బలగాలు జరిపిన  కాల్పుల్లో  భారీ సంఖ్యలో మావోయిస్టులు మృతి చెందారు. దీనిని ప్రతీకారంగానే పోలీసు శిబిరంపై మావోయిస్టులు దాడికి యత్నించినట్లు పోలీసులు భావిస్తున్నారు.  

ఇదీ చదవండి..జమ్మూకాశ్మీర్‌లో కాల్పుల మోత 

Advertisement
 
Advertisement
Advertisement