దిగొచ్చిన ‘మహా’ సర్కారు.. 'హిందీ తప్పనిసరి' తీర్మానం రద్దు | Maharashtra Cancels Language Policy Resolution | Sakshi
Sakshi News home page

దిగొచ్చిన ‘మహా’ సర్కారు.. 'హిందీ తప్పనిసరి' తీర్మానం రద్దు

Jun 29 2025 8:07 PM | Updated on Jun 29 2025 8:11 PM

Maharashtra Cancels Language Policy Resolution

ముంబై:  దేశ వ్యాప్తంగా అమలు చేయాలని చూస్తున్న ‘త్రి భాషా విధానం’లో భాగంగా హిందీని తప్పనిసరి చేయాలనే అంశంపై పలు రాష్ట్రాల్లో తీవ్ర నిరసలు వ్యక్తమవుతున్నాయి. మహారాష్ట్రలో కూడా ఈ సెగ గట్టిగానే ఉండటంతో ఫడ్నవీస్‌ సర్కార్‌ వెనక్కి తగ్గింది.  ఈ త్రి భాషా విధానం పాలసీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. 

దీనికి సంబంధించి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించే పనిలో పడింది. గత ఉద్ధవ్‌ ఠాక్రే సర్కారే దీనికి ఆమోదం తెలిపి, ఇప్పుడు నిరసనలకు పిలుపునివ్వడంపై ఫడ్నవీస్‌ తప్పుబడుతున్నారు.   మహారాష్ట్రలో మరాఠీ, హిందీ, ఇంగ్లీష్‌ భాషలు ఒకటో తరగతి నుంచే అమలు చేయాలని ఉద్ధవ్‌ సర్కార్‌ అప్పుడు నిర్ణయం తీసుకుని, ఇప్పుడు ఎందుకు దీనిని వ్యతిరేకిస్తున్నారని సీఎం ఫడ్నవీస్‌ ప్రశ్నించారు. 

త్రి భాషా విధానంపై  శివసేన(యూబీటీ) అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలో నిరసన సెగ తీవ్రతరమైంది. హిందీని తప్పనిసరి చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన తీర్మానాన్ని వ్యతిరేకించాలని, దానికి సంబంధించిన తీర్మానం ప్రతులను చించి వేయాలని శివసేన(యూబీటీ) చీఫ ఉద్ధవ్ ఠాక్రే పార్టీ కార్యకర్తలు, నేతలకు సూచించారు. దక్షిణ ముంబైలో జరిగే నిరసన కార్య క్రమానికి నేటి నుంచి శాసనసభ వర్షాకాల సమావేశాలు మొదలవుతున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి.  ఈ క్రమంలోనే ఆ పాలసీని రద్దు చేస్తున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. 


 

Advertisement
 
Advertisement
Advertisement