Lok sabha elections 2024: బీజేపీలో చేరిన అనురాధా పౌడ్వాల్‌ | Lok sabha elections 2024: Singer Anuradha Paudwal join in BJP | Sakshi
Sakshi News home page

Lok sabha elections 2024: బీజేపీలో చేరిన అనురాధా పౌడ్వాల్‌

Mar 17 2024 5:07 AM | Updated on Mar 17 2024 3:24 PM

Lok sabha elections 2024:  Singer Anuradha Paudwal join in BJP - Sakshi

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల వేళ ప్రముఖ బాలీవుడ్‌ గాయని అనురాధా పౌడ్వాల్‌ బీజేపీలో చేరారు. శనివారం ఆమె ఢిల్లీలో బీజేపీ సీనియర్‌ నేతలు అరుణ్‌ సింగ్, అనిల్‌ బలూనీ తదితరుల సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు.

సనాతన ధర్మం కోసం కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందని, బీజేపీ విధానాలు ఎంతగానో నచ్చాయని అన్నారు. అందుకే బీజేపీలో చేరుతున్నట్లు ఆమె మీడియాతో పేర్కొన్నారు. మొదట్లో సినిమా పాటలు పాడిన అనురాధా పౌడ్వాల్‌ తర్వాత ఆధ్యాత్మిక గీతాల ద్వారా ఎక్కువ పేరు సంపాదించుకున్నారు. 2017లో కేంద్రం ఆమెను ‘పద్మశ్రీ’తో గౌరవించింది.

Advertisement
 
Advertisement
Advertisement