Live Updates: Delhi Services Bill, Manipur Set To Raise Storm In Parliament - Sakshi
Sakshi News home page

మణిపూర్‌ వ్యవహారం.. ఉభయ సభలు రేపటికి వాయిదా

Published Mon, Jul 31 2023 9:46 AM

Live Updates: Delhi Services Bill, Manipur Set To Raise Storm In Parliament - Sakshi

Live Updates:

► పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో సోమవారం(జులై 31)..  మణిపూర్‌ వ్యవహారంపై స్వల్పకాలిక చర్చకు ఇటు లోక్‌సభ స్పీకర్‌, అటు రాజ్యసభ చైర్మన్‌ అంగీకరించినా..  విపక్షాలు మాత్రం ప్రధాని మోదీ సమక్షంలో దీర్ఘకాలిక చర్చ జరగాలని పట్టుబడుతున్నాయి. ఈ క్రమంలో ఇవాళ కూడా నినాదాలతో తమ ఆందోళన కొనసాగించాయి. సభలు ముందుకు సాగకపోవంతో పార్లమెంట్‌ ఉభయ సభలు వాయిదా పడ్డాయి.  తిరిగి మంగళవారం ఉదయం 11 గంటలకు ఉభయ సభలు మొదలుకానున్నాయి. 

► పార్లమెంట్‌ను 9 రోజుల పాటు నినాదాలు చేసి సభలు జరగనివ్వకుండా పాడు చేశారని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ విపక్షాలపై మండిపడ్డారు. అయితే.. సినిమాటోగ్రాఫ్ (సవరణ) బిల్లు, 2023 మాత్రం ఇవాళ ఆమోదం పొం‍దగలిగింది. తొలుత రాజ్యసభలో ఆమోదం పొందిన తర్వాత లోక్‌సభలో ఆమోదించబడింది.

► రాజ్యసభలో మణిపూర్ హింసపై స్వల్పకాలిక చర్చ ప్రారంభమైంది. ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆందోళన చేస్తున్నాయి.

►పార్లమెంటులో మణిపూర్‌ మంటలు ఆరడం లేదు. గత పదిరోజులుగా ఉభయ సభల్ని మణిపూర్‌ అంశం కుదిపేస్తోంది. మధ్యాతర్వాత రాజ్యసభలో మణిపూర్‌పై చర్చకు సిద్ధమని తెలిపిన ప్రభుత్వం తెలిపింది. అయితే అవిశ్వాసంపై వెంటనే చర్చించాలంటూ లోక్‌సభలో విపక్షాలు పట్టుబట్టాయి. 

►మణిపూర్ హింసాకాండపై ప్రతిపక్ష ఎంపీల నిరసనలు, నినాదాల మధ్య రాజ్యసభ కూడా మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడింది.

►లోక్‌సభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. మణిపూర్‌ ఘటనపై విపక్ష ఎంపీలో నినాదాలతో హోరెత్తించడంతో ప్రారంభమైన కొన్ని నిమిషాలకే లోక్‌సభను వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ ఓంబిర్లా ప్రకటించారు.

► సభా నాయకుడు పీయూష్ గోయల్ మాట్లాడుతూ,నేటి  మధ్యాహ్నం 2 గంటలకు పార్లమెంటులో మణిపూర్‌పై చర్చలు జరపాలని తాము కోరుకుంటున్నట్లు రాజ్యసభలో కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ వెల్లడించారు. ప్రతిపక్షాక్ష సభ్యులు తమకు ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేయడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. కేంద్రం మణిపూర్‌పై చర్చకు సిద్ధంగా ఉందని చెబుతున్నా.. విపక్షాలు ఇప్పటికే 9 రోజులగా సభలను అడ్డుకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు

►పార్లమెంట్‌లో కేంద్ర మంత్రులతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు.

మణిపూర్‌పై చర్చ జరగకుండా ప్రతిపక్షాలను ఎవరు ఆపుతున్నారు అని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రశ్నించారు. పార్లమెంటు లోపలికి వచ్చి చర్చల్లో పాల్గొనాలని మేము మొదటి రోజు నుంచి కోరుతున్నామని.. చర్చలు జరపకుండా వారిని ఆపేది ఏంటని నిలదీశారు. చర్చలో పాల్గొనకుండా పారిపోతారని విమర్శించారు. రాజకీయాల కోసం మణిపూర్‌ అంశాన్ని వాడుకుంటున్నట్లు స్పష్టంగా తెలుస్తోందన్నారు.

విపక్షాల భేటీ
ఇటీవల మణిపూర్‌లో పర్యటించిన ఎంపీలతో ప్రతిపక్ష ఇండియా కూటమి భేటీ అయింది. పార్లమెంట్‌ హౌజ్‌ భవనంలోని కాంగ్రెస్‌ పార్టమెంటరీ పార్టీ(సీపీపీ) కార్యాలయంలో సమావేశమయ్యాయి. రెండు రోజుల పర్యటన వివరాలను ఎంపీల బృందం విపక్ష నేతలకు వివరిస్తున్నాయి. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్ పర్సన్ సోనియా గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. కాగా విపక్షపార్టీలకు చెందిన 21 మంది ఎంపీలు రెండు రోజులపాటు మణిపూర్‌ రాష్ట్రంలో పర్యటించిన విషయం తెలిసిందే.

మణిపూర్ పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది: అధిర్ రంజన్
పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు అధిర్ రంజన్ చౌదరి మాట్లాడుతూ.. అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగాలనేది తమ డిమాండ్‌గా పేర్కొన్నారు. మణిపూర్‌లో పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది.. దేశాన్ని రక్షించాల్సిన అవసరం ఉందన్నారు. బీజేపీ, మిత్రపక్షాలు కూడా మణిపూర్‌లో పర్యటించాలని, అక్కడి పరిస్థితిని అందరూ విశ్లేషించుకోవాలని సూచించారు.
చదవండి: మణిపూర్‌ హింస.. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన బాధిత మహిళలు

న్యూఢిల్లీ: పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు తిరిగి సోమవారం ప్రారంభమయ్యాయి. ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతంలోని అధికారుల నియామకాలు, బదిలీకి సంబంధించిన  ఆర్డినెన్స్‌ బిల్లును కేంద్రం  నేడు (జూలై 31) పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. లోక్‌సభలో కేంద్రమంత్రి అమిత్‌షా ఈ బిల్లును ప్రవేశ పెట్టనుననారు. ఈ బిల్లును వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాల నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఎదురయ్యే పరిస్థితులు ఉన్నాయి. దీంతో సభలో మరింత గందరగోళం నెలకొనే సూచనలు కనిపిస్తున్నాయి.

ఇక ఢిల్లీలో అధికారుల నియమకాలు, బదిలీలను తన అధీనంలోకి తీసుకుంటూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌ కేంద్రం, ఢిల్లీలో కేజ్రివాల్‌ ప్రభుత్వం మధ్య కొత్త వివాదాన్ని రేపిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ బిల్లుకు మోదీ మంత్రివర్గం ఇప్పటికే ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం మణిపూర్‌ హింసపై పార్లమెంట్‌ సమావేశాల్లో ప్రతిష్టంభన కొనసాగుతోంది. దీనిపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటన చేయాలని ప్రతిపక్షాలు మూకుమ్మడిగా డిమాండ్‌ చేస్తున్నాయి. కేంద్రానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష కూటమి పార్లమెంటులో అవిశ్వాస తీర్మానాన్ని కూడా సమర్పించింది. దానిపై ఇంకా చర్చించలేదు. ఓటింగ్ జరగలేదు.

లోక్‌సభలో రగడ
ఈ క్రమంలో లోక్‌సభలో నేషనల్‌ క్యాపిటల్‌ టెరిటరీ ఆఫ్‌ ఢిల్లీ గవర్నమెంట్‌(సవరణ) బిల్లు తీసుకురావడంపై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఇండియా కూటమిలో భాగమైన కేజ్రీవాల్‌ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. కాంగ్రెస్‌తోపాటు ఇతర పార్టీలు కూడా ఈ బిల్లును వ్యతిరేకిస్తుండటంతో.. పార్లమెంట్‌ వేదికగా దీనిని అడ్డుకునేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. దీంతో సోమవారం లోక్‌సభలో రగడ జరిగే అవకాశం కనిపిస్తోంది.

ఈ ఆర్డినెన్స్ తీసుకురావడానికి ముందు ఢిల్లీలో బదిలీలు, నియామకాలకు సంబంధించిన విషయాల్లో నిర్ణయాధికారాలను ఢిల్లీ ప్రభుత్వానికి ఇస్తున్నట్లు సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది. దీనికి లెక్కచేయకుండా అధికార యంత్రాంగంపై ఢిల్లీ ప్రభుత్వానికి ఉన్న అధికారాలను తగ్గిస్తూ కేంద్రం ఆర్డినెన్స్‌ తీసుకొచ్చింది. అయితే ఇది చట్టవిరుద్దమంటూ,  ఆర్డినెన్స్‌ను సవాల్‌ చేస్తూ ఇప్పటికే ఆప్‌ సర్కార్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టనుంది.  

Advertisement
Advertisement