ఢిల్లీ వాయు కాలుష్యం.. ఇక అనుమతులు నో..! | Key measures by the government regarding Delhi's air pollution | Sakshi
Sakshi News home page

ఢిల్లీ వాయు కాలుష్యం.. ఇక అనుమతులు నో..!

Jul 1 2026 8:21 PM | Updated on Jul 1 2026 8:21 PM

Key measures by the government regarding Delhi's air pollution

సాక్షి,ఢిల్లీ: వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు ఢిల్లీ ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టనుంది. శీతాకాల కాలుష్య  మాస్టర్ ప్లాన్‌ శాశ్వత నిబంధనలలో భాగంగా నవంబర్ 1 2026 నుండి ఫిబ్రవరి 28, 2027 వరకు  రాజధాని పరిసరాల్లో  నిర్మాణ పనులకు అనుమతి నిరాకరించనున్నట్లు తెలిపింది. 

అదేవిధంగా నవంబర్ 1నుండి జనవరి 31వరకు ఢిల్లీలో కూల్చివేతలు, సివిల్ నిర్మాణ కార్యకలాపాలపై నిషేధం, ప్రభుత్వ కార్యాలయాల అధికారులకు 50 శాతం వర్క్ ఫ్రమ్ హోమ్, పీయూసీ (PUC) సర్టిఫికెట్ లేని వాహనాలకు ఇంధనం నిరాకరణ తదితర చర్యలు  చేపట్టనున్నట్లు తెలిపింది.

పార్కింగ్ ఛార్జీల రెట్టింపు సైతం నవంబర్‌ 1 నుండి అమలులోకి వస్తాయని తెలిపింది. శీతాకాల కాలుష్య మాస్టర్ ప్లాన్‌ శాశ్వత నిబంధనలను ఢిల్లీ ప్రభుత్వం నోటిఫై చేసింది. ఢిల్లీని పరిశుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచడానికి ప్రజలు భాగస్వామ్యం వహించాలని ఈ సందర్భంగా ఆ రాష్ట్ర సీఎం  రేఖా గుప్తా పిలుపునిచ్చారు. 

కాగా ఢిల్లీలో ఏటా వాయుకాలుష్యం తీవ్ర ప్రమాదకర స్థాయికి చేరుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement