కేంద్ర ఆర్డినెన్స్‌పై ఆప్‌కు జేఎంఎం మద్దతు | Jharkhand Mukti Morcha will support AAP in Delhi ordinance fight | Sakshi
Sakshi News home page

కేంద్ర ఆర్డినెన్స్‌పై ఆప్‌కు జేఎంఎం మద్దతు

Jun 3 2023 4:15 AM | Updated on Jun 3 2023 4:15 AM

Jharkhand Mukti Morcha will support AAP in Delhi ordinance fight - Sakshi

రాంచీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో పాలనా యంత్రాంగంపై నియంత్రణ కోసం కేంద్రం తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో ఆప్‌కు మద్దతిస్తామని జార్ఖండ్‌ ముక్తి మోర్చా(జేఎంఎం) ప్రకటించింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజాబ్‌ సీఎం మాన్‌ శుక్రవారం రాంచీలో జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌తో భేటీ అయ్యారు.

అనంతరం కేజ్రీవాల్, మాన్, సోరెన్‌ మీడియాతో మాట్లాడారు.  వచ్చే పార్లమెంట్‌ సమావేశాల్లో ఆర్డినెన్స్‌ స్థానంలో కేంద్రం ప్రవేశపెట్టే బిల్లును తప్పకుండా ఓడించాలన్నారు.  కేంద్ర ఆర్డినెన్స్‌ విషయంలో ఆప్‌కు జేఎంఎం మద్దతుగా నిలుస్తుందని ఆ పార్టీ చీఫ్, సీఎం సోరెన్‌ చెప్పారు. ఆర్డినెన్స్‌పై మద్దతు కూడగట్టేందుకు కేజ్రీవాల్‌ బీజేపీయేతర పార్టీల నేతలను కలుస్తున్న విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement