కరాచీ దాడిపై పాక్‌కు భారత్ గట్టి కౌంటర్ | India Rejects Pakistan’s Allegations Over Karachi Attack, Urges Action Against Terror Networks | Sakshi
Sakshi News home page

కరాచీ దాడిపై పాక్‌కు భారత్ గట్టి కౌంటర్

Jun 29 2026 8:42 AM | Updated on Jun 29 2026 10:46 AM

India Slams Paks Baseless Claims After Karachi Attack

న్యూఢిల్లీ: పాక్‌లోని కరాచీలో జరిగిన ఉగ్రదాడి వెనుక భారతీయ ఏజెంట్ల హస్తం ఉందంటూ పాకిస్తాన్ చేసిన ఆరోపణలను భారతదేశం తీవ్రంగా ఖండించింది. ఎలాంటి ఆధారాలు లేకుండా ఇతరులవైపు వేలు చూపించడం మానేసి, తమ సొంత భూభాగంలో పెరుగుతున్న ఉగ్రవాద నెట్‌వర్క్‌లను అణచివేయడంపై దృష్టి పెట్టాలని ఢిల్లీ గట్టిగా హితవు పలికింది. మరోవైపు, ఈ దాడికి నిరసనగా పాకిస్తాన్ సైన్యం తూర్పు అఫ్గానిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై అర్ధరాత్రి వేళ ఆకస్మిక వైమానిక దాడులకు తెగబడటంతో ఇరు దేశాల సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పీక్‌కు చేరాయి.

కరాచీలోని పాకిస్తాన్ రేంజర్స్ ప్రాంతీయ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడిలో ‘ఇండియన్ ప్రాక్సీ’ ప్రమేయం ఉందంటూ పాక్ అంతర్గత వ్యవహారాల మంత్రి మొహ్సిన్ నఖ్వీ చేసిన వ్యాఖ్యలను భారత విదేశాంగ శాఖ తీవ్రంగా తప్పుపట్టింది. ఈ ఆరోపణలు పూర్తిగా అసంబద్ధమైనవని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. కరాచీలోని పారామిలిటరీ బలగాల కేంద్రమే లక్ష్యంగా పేలుడు పదార్థాలతో కూడిన వాహనాన్ని ఒక ఉగ్రవాది వేగంగా ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన జరిగింది. అనంతరం భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన హోరాహోరీ ఎదురుకాల్పుల్లో ముగ్గురు పాకిస్తాన్ సైనికులు ప్రాణాలు కోల్పోగా, నలుగురు గాయపడ్డారు. 

ఇది కూడా చదవండి: హిజ్బుల్లా భారీ ఆయుధ సొరంగాన్ని పేల్చివేసిన ఇజ్రాయెల్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement