Husband Ask Wife Giving Up Her Food Video Goes Viral - Sakshi
Sakshi News home page

భర్త కోసం త్యాగం.. ఇలాంటి అమ్మాయి భార్యగా వస్తే ఎంత బాగుంటుందో!

Aug 2 2023 3:59 PM | Updated on Aug 2 2023 6:09 PM

Husband Ask Wife Giving Up Her Food Video Goes Viral - Sakshi

దంపతులు అంటే అన్యోన్యంగా ఒకరినొకరు అర్థం చేసుకుని కలిసి జీవించాలంటారు. అయితే ఇటీవల కొందరు చిన్న చిన్న విషయాలకు గొడవలు పడుతూ, ఈగోలకు పోతూ వారి దాంపత్య జీవితానికి ఫుల్‌ స్టాప్‌ పెడుతుంటారు. ఇంకొందరు మాత్రం అర్థం చేసుకుంటూ, అడ్జస్ట్‌ అవుతూ  ఆనందంగా గడుపుతుంటారు. తాజాగా ఈ తరహాలోనే ఓ భార్య తన భర్త కోసం చేసిన పనిని అంతా మెచ్చుకుంటున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌ చ​క్కర్లు కొడుతోంది.

ఆ వీడియోలో.. ఓ భార్యా భర్తలు డైనింగ్‌ టేబుల్‌పై కూర్చుని తింటూ ఉంటారు. భర్త తింటూ మొబైల్‌ చూస్తూ ఉంటాడు. అంతలోగా అతని ప్లేటులో అన్నం అయిపోతుంది. దీంతో పక్కనే తన భార్యను వడ్డించమని అడిగి.. మళ్లీ మొబైల్‌లో మునిగిపోతాడు. అయితే అప్పటికే అన్నం పూర్తిగా అయిపోతుంది. ఇది గమనించిన ఆ మహిళ.. తన భర్త ఆకలి తీర్చేందుకు వెనుక ముందు ఏం ఆలోచించకుండా తన ప్లేటులో ఉన్న ఆహారాన్ని ఇస్తుంది.

అలానే ఈ విషయం తన భర్తకి తెలియకుండా ఉండేందుకు గిన్నెలో నుంచి అన్నం పెట్టినట్లుగా నటిస్తుంది. అయితే ఇవేమీ ప‌ట్టించుకోని భ‌ర్త ఫోన్ చూసుకుంటూ అన్నం తింటాడు. తాజాగా ఈ వీడియో నెట్టింట షేర్‌ చేయగా.. అది కాస్త వైరల్‌గా మారింది. తన భర్త కోసం ఆ మ‌హిళ చేసిన త్యాగాన్ని ప్ర‌శంసిస్తూ నెటిజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు. ఇంకొందరు మాత్రం భ‌ర్త ఏమాత్రం భార్య త్యాగాన్ని ప‌ట్టించుకోక‌పోవ‌డం ఏంట‌ని మండిపడుతు కామెంట్లు పెట్టారు.
 

చదవండి    ఫ్లాట్‌ అద్దె రూ.2.5 లక్షలు.. 25 లక్షల అడ్వాన్స్‌! షాకైన టెక్‌ కంపెనీ సీఈఓ.. ట్విటర్‌లో మీమ్స్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement