ఇది మోదీ సర్కార్‌.. ఏ ఒక్క ఉగ్రవాదిని వదలం: అమిత్‌ షా | Home Minister Amit Shah First reaction On Pahalgam incident | Sakshi
Sakshi News home page

ఇది మోదీ సర్కార్‌.. ఏ ఒక్క ఉగ్రవాదిని వదలం: పహల్గాం ఘటనపై అమిత్‌ షా

May 1 2025 6:02 PM | Updated on May 1 2025 6:35 PM

Home Minister Amit Shah First reaction On Pahalgam incident

న్యూఢిల్లీ, సాక్షి: పహల్గాం ఉగ్రదాడి ఘటనపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తొలిసారి స్పందించారు. దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని.. ఏ ఒక్క ఉగ్రవాదిని వదిలే ప్రసక్తే లేదని అన్నారాయన. 

గురువారం న్యూఢిల్లీలో బోడో సామాజిక వేత్త ఉపేంద్రనాథ్‌ బ్రహ్మ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న అమిత్‌ షా ప్రసంగిస్తూ.. కొందరు దాడి చేసి విజయం సాధించామని అనుకుంటే అది పొరపాటే. ఇది మోదీ సర్కార్. మోదీ సర్కార్ ఎవరినీ వదిలి పెట్టదు. ఉగ్రవాదులు ఎక్కడ దాక్కున్నా వెతికి పట్టుకుని శిక్షిస్తాం. ఉగ్రవాదులకు సరైన సమాధానం చెప్పడం ఖాయం. 

ఇప్పటికే కశ్మీర్ లో ఉగ్రవాద చర్యలకు గట్టి సమాధానం ఇస్తున్నాం. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకుంటాం. పహల్గాం అమాయకుల చావులకు కారణమైన ప్రతి ఒక్కరూ మూల్యం చెల్లించుకోవాల్సిందే. ఉగ్రవాదాన్ని తుదముట్టించడమే మా ప్రభుత్వ సంకల్పమని, దానిని సాధించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని అన్నారాయన.  

Advertisement
 
Advertisement
Advertisement