ముఖ్యమంత్రి విజయ్‌కి విశాల్ ఇచ్చిన బహుమతి ఏమిటి? | Hero Vishal Meet To Chief Minister Vijay | Sakshi
Sakshi News home page

ముఖ్యమంత్రి విజయ్‌కి విశాల్ ఇచ్చిన బహుమతి ఏమిటి?

Jun 18 2026 1:31 PM | Updated on Jun 18 2026 1:57 PM

Hero Vishal Meet To Chief Minister Vijay

టీవీకే పార్టీ అధ్యక్షుడు జోసఫ్ విజయ్‌ను ముఖ్యమంత్రి అయిన తరువాత చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఆయన్ని కలవడానికి వరుస కడుతున్నారనే చెప్పాలి. అలా తాజాగా నటుడు విశాల్ ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్‌ను మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి జోసఫ్ విజయ్‌కు మర్చిపోలేని బహుమతిని ఇచ్చారు. అందుకు ముఖ్యమంత్రి విశాల్‌కు ధన్యవాదాలు తెలిపారు.

ఇంతకీ నటుడు విశాల్ ముఖ్యమంత్రి జోసఫ్ విజయ్‌కి అందించిన ఆ బహుమతి ఏమిటి? దీని గురించి మీడియా విడుదల చేసిన ప్రకటనలో విశాల్ తెలుపుతూ నేను నెలకొల్పిన దేవి ట్రస్ట్ ద్వారా పలువురు విద్యార్థుల ఉన్నత విద్య సాయం చేస్తున్నాను. అదే విధంగా నేను నిర్వహించే కార్యక్రమాలకు అభినందించడానికి వచ్చే ప్రముఖులకు బొకేలు, పూల మాలలు వంటివి కాకుండా ఆ డబ్బును పేద విద్యార్థులకు సాయం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా సోమవారం ముఖ్యమంత్రి జోసఫ్ విజయ్‌ని కలినప్పుడు ఆయనకు బహుమతిగా ఆయన పేరుతో ముగ్గురు పేద విద్యార్థులకు ఉన్నత విద్య చదివిస్తానని చప్పాను.

 ఆ ముగ్గురు విద్యార్థుల పేరు వివ రాలను కూడా తెలియజేశాను. ఈ బహుమతికి ముఖ్యమంత్రి జోసఫ్ విజయ్ ధన్యవాదాలు తెలిపా రు" అని నటుడు విశాల్ పేర్కొన్నారు. అదే విధంగా ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్‌ను నటుడు శింబు, నటి సిమ్రాన్ కుటుంబం, నటుడు శ్యామ్ తదితర సినీ ప్రముఖులు కలిశారు. ఇటీవల నటి స్నేహ, ప్రసన్న దంపతులు కూడా తమ పిల్లలతో సహా కలిశారన్నది గమనార్హం.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement