breaking news
Chief Minister Vijayan
-
ముఖ్యమంత్రి విజయ్‌కి విశాల్ ఇచ్చిన బహుమతి ఏమిటి?
టీవీకే పార్టీ అధ్యక్షుడు జోసఫ్ విజయ్ను ముఖ్యమంత్రి అయిన తరువాత చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఆయన్ని కలవడానికి వరుస కడుతున్నారనే చెప్పాలి. అలా తాజాగా నటుడు విశాల్ ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ను మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి జోసఫ్ విజయ్‌కు మర్చిపోలేని బహుమతిని ఇచ్చారు. అందుకు ముఖ్యమంత్రి విశాల్‌కు ధన్యవాదాలు తెలిపారు.ఇంతకీ నటుడు విశాల్ ముఖ్యమంత్రి జోసఫ్ విజయ్‌కి అందించిన ఆ బహుమతి ఏమిటి? దీని గురించి మీడియా విడుదల చేసిన ప్రకటనలో విశాల్ తెలుపుతూ నేను నెలకొల్పిన దేవి ట్రస్ట్ ద్వారా పలువురు విద్యార్థుల ఉన్నత విద్య సాయం చేస్తున్నాను. అదే విధంగా నేను నిర్వహించే కార్యక్రమాలకు అభినందించడానికి వచ్చే ప్రముఖులకు బొకేలు, పూల మాలలు వంటివి కాకుండా ఆ డబ్బును పేద విద్యార్థులకు సాయం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా సోమవారం ముఖ్యమంత్రి జోసఫ్ విజయ్‌ని కలినప్పుడు ఆయనకు బహుమతిగా ఆయన పేరుతో ముగ్గురు పేద విద్యార్థులకు ఉన్నత విద్య చదివిస్తానని చప్పాను. ఆ ముగ్గురు విద్యార్థుల పేరు వివ రాలను కూడా తెలియజేశాను. ఈ బహుమతికి ముఖ్యమంత్రి జోసఫ్ విజయ్ ధన్యవాదాలు తెలిపా రు" అని నటుడు విశాల్ పేర్కొన్నారు. అదే విధంగా ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ను నటుడు శింబు, నటి సిమ్రాన్ కుటుంబం, నటుడు శ్యామ్ తదితర సినీ ప్రముఖులు కలిశారు. ఇటీవల నటి స్నేహ, ప్రసన్న దంపతులు కూడా తమ పిల్లలతో సహా కలిశారన్నది గమనార్హం. -
అమిత్ షాకు ట్వీట్ చిక్కు
న్యూఢిల్లీ: ఓనం పండుగ సందర్భంగా కేరళ పౌరులకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చేసిన ట్వీట్ వివాదాన్ని రేపింది. ఆయన ఓనం శుభాకాంక్షలు అని చెప్పడానికి బదులు వామన జయంతి శుభాకాంక్షలు అని చెప్పడంతో కేరళీయుల మనసును గాయపరిచినట్లయింది. దీనిపై ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూడా స్పందించారు. మొత్తం కేరళ ప్రజలకు అమిత్ షా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అసలు ఎందుకు వివాదం అయిందంటే కేరళలో ఓనం పండుగను మహాబలి త్యాగానికి గుర్తుగా చేసుకుంటారు. మహాబలి అంటే మానవత్వానికి ప్రతీక అని, ఐకమత్యానికి చిహ్నం అని భావిస్తారు. అక్కడది అది రాష్ట్ర పండుగ కూడా. వామనావతారంలో విష్ణుమూర్తి పాతాళంలోకి బలిచక్రవర్తిని తొక్కేస్తాడు. అనంతరం అతడి కోరిక మేరకు ఏడాదికి ఓ సారి తన ప్రజలను చూసేందుకు వచ్చేలా వరమిస్తాడు. దీంతో ప్రతి ఏడాది బలిచక్రవర్తి తమ ఇళ్లకు వచ్చి ప్రజల సంతోషాన్ని చూస్తాడన్నది భక్తుల నమ్మకం. ఆ రోజే ఓనమ్ పండుగ అతి వైభవంగా జరుపుకుంటారు. పేదవాళ్లు, ధనవంతులు అని భేదం లేకుండా అందరూ తప్పనిసరిగా ఈ పండుగ వేడుకలను జరుపుకుంటారు. పది రోజులపాటు ఇది జరుగుతుంది. చివరి రోజున బలి రాకకోసం ఎదురుచూస్తూ ఆ రోజు మొత్తాన్ని ఆయనకు అంకితం చేసి భక్తి శ్రద్దలతో పూజలు జరుపుకుంటారు. అలాంటి రోజున వామనుడి అవతారాన్ని ప్రశంసిస్తూ.. విష్ణు స్వరూపుడైన 'వామన జయంతి' అంటూ శుభాకాంక్షలతో అమిత్ షా ట్వీట్ చేశారు. ఇది కేరళ వాసులకు ఆగ్రహాన్ని తెప్పించింది. సీఎం విజయన్ కూడా క్షమాపణలు డిమాండ్ చేసిన కొద్ది సేపటికే హ్యాపీ ఓనం అంటూ అమిత్ షా మరో ట్వీట్ చేయడం గమనార్హం.


