తేనెటీగలదాడి.. తల్లీ ముగ్గురు కూతుళ్లు మృతి | Four Of Family Died In Bees Attack | Sakshi
Sakshi News home page

తేనెటీగలదాడిలో తల్లీముగ్గురు కూతుళ్లు మృతి

Sep 23 2024 4:08 PM | Updated on Sep 23 2024 4:08 PM

Four Of Family Died In Bees Attack

రాంచీ:తేనేటీగల దాడిలో తల్లి ముగ్గురు కుమార్తెలు మృతిచెందిన విషాద ఘటన జార్ఖండ్‌ రాజధాని రాంచీలో జరిగింది.జ్యోతిగడి అనే మహిళ తన ముగ్గురు కుమార్తెలను తీసుకుని వీకెండ్‌ సరదాగా గడిపేందుకు తన పుట్టింటికి వెళ్లింది. వీరంతా కలిసి శనివారం(సెప్టెంబర్‌21)అకడున్న ఒక బావిలో స్నానం చేసేందుకు దిగారు.

ఇంతలో ఎక్కడినుంచో వచ్చిన తేనెటీగల గుంపు ఒక్కసారిగా వారిపై దాడి చేసింది.దీంతో తల్లీకూతుళ్లు గట్టిగా అరవడంతో చుట్టుపక్కల ఉన్నవారు అక్కడి నుంచి పారిపోయారు తేనెటీగల దాడికి తట్టుకోలేక నలుగురూ బావిలోనే ప్రాణాలు విడిచారు.పోలీసులు నలుగురి మృతదేహాలను బావి నుంచి వెలికితీసి పోస్టమార్టంకు పంపారు.

 ఇదీ చదవండి: కామాంధుడి చెర నుంచి రక్షించిన కోతులు

Advertisement
 
Advertisement
Advertisement