రాజ్యాంగ నిపుణుడు సుభాష్‌ కన్నుమూత  | Former Lok Sabha Secretary-General Subhash C Kashyap passes away | Sakshi
Sakshi News home page

రాజ్యాంగ నిపుణుడు సుభాష్‌ కన్నుమూత 

Jun 5 2026 1:23 AM | Updated on Jun 5 2026 1:23 AM

Former Lok Sabha Secretary-General Subhash C Kashyap passes away

న్యూఢిల్లీ: లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్, రాజ్యాంగ నిపుణుడు సుభాష్‌ సి కశ్యప్‌ తుదిశ్వాస విడిచారు. 97 ఏళ్ల కశ్యప్‌ దీర్ఘకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న గురువారం ఉదయం 10 గంటలకు ఢిల్లీలో ని సైనిక్‌ఫామ్‌ సొంతింట్లో గుండెపోటుతో కన్నుమూశారని లోక్‌సభ సెక్రటేరియట్‌ ఒక ప్రకటనలో పేర్కొంది. జమిలీ ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై మాజీ రాష్ట్ర పతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సారథ్యంలో ఏర్పాటైన అత్యున్నత కమిటీలో కశ్యప్‌ సభ్యునిగా ఉన్నారు. 

1983 నుంచి ఏడేళ్లపాటు లోక్‌సభ ప్రధాన కార్యదర్శిగా కశ్యప్‌ సేవలందించారు. జవహర్‌లాల్‌ నెహ్రూ కాలంలో కొలువుతీరిన తొలి లోక్‌సభ మొదలు 9వ లోక్‌సభాకాలం దాకా మొత్తంగా 37 సంవత్సరాలపాటు పార్లమెంట్‌లో పనిచేసి రాజ్యాంగం సంబంధ విషయాలపై కశ్యప్‌ అసాధారణ పట్టుసాధించారు. 100కుపైగా పుస్తకాలను రచించారు. 

స్వాతం్రత్యానికి పూర్వం యునైటెడ్‌ ప్రావిన్స్‌లో నేటి ఉత్తరప్రదేశ్‌లో 1929లో బిజ్నోర్‌ పరిధిలోని ఛాద్‌పూర్‌ గ్రామంలో స్వాతంత్య్రసమరయోధుల కుటుంబంలో కశ్యప్‌ జని్మంచారు. తండ్రి, తాతల మాదిరిగా టీనేజీలోనే దేశస్వాతంత్య్రం కోసం పోరాటం ఆరంభించారు. బిజ్మోర్‌లో స్థానికంగా విద్యార్థి ఉద్యమంలో పాల్గొని తర్వాత మీరట్‌లో కొనసాగించారు. ఈయన చక్కటి చదువరి. అలహాబాద్‌ మొదలు న్యూఢిల్లీ, వాషింగ్టన్‌ డీసీ, లండన్, జెనీవా నగరాల దాకా పలు విద్యాలయాల్లో ఉన్నత విద్యను అభ్యసించారు. అయినాసరే పాత్రికేయునిగా వృత్తిజీవితం మొదలెట్టారు. తర్వాత అలహాబాద్‌ వర్సిటీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేశారు. తర్వాత అలహాబాద్‌ హైకోర్టులో న్యాయవాదిగా శిక్షణ పొందారు. చివరకు పార్లమెంట్‌లో ఉద్యోగంలో చేరారు. 

అటల్‌ బిహారీ వాజ్‌పేయీ ప్రభుత్వ హయాంలో రాజ్యాంగం అమలుతీరును పర్యవేక్షించే జాతీయ కమిషన్‌లో ముసాయిదా కమిటీ చైర్మన్‌గా సేవలందించారు. వాలంటరీ రిటైర్మెంట్‌ తీసుకున్నాక పంచాయతీరాజ్‌ చట్టాలపై భారత ప్రభుత్వానికి గౌరవ రాజ్యాంగ సలహాదారుగానూ పనిచేశారు. ఆయన సేవలకుగాను కేంద్ర ప్రభుత్వం గతంలో ఆయనను పద్మభూషణ్‌తో సత్కరించింది. ఈయనను ఎన్నో గౌరవ డాక్టరేట్లు వరించాయి. ఈయనకు భార్య, ఇద్దరు కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. కశ్యప్‌ మరణవార్త తెలిసి లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా తీవ్ర విచారం వ్యక్తంచేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement