ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఆదాయపు పన్ను శాఖకు చెందిన భవనంలో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటీన అక్కడికి చేరుకుంది. 12 ఫైరింజన్లతో మంటలు ఆర్పే యత్నం చేస్తుంది. మంటలు భారీగా ఎగిసిపడుతుండడంతో అగ్నిమాపక సిబ్బంది మంటలార్పడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.


