ఢిల్లీలో మరో ప్రమాదం.. రెస్టారెంట్‌లో మంటలు.. పలువురికి గాయాలు | Fire Breaks out in Fast Food Shop and a Restaurant in Delhi | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో మరో ప్రమాదం.. రెస్టారెంట్‌లో మంటలు.. పలువురికి గాయాలు

Jul 29 2024 7:12 AM | Updated on Jul 29 2024 9:16 AM

Fire Breaks out in Fast Food Shop and a Restaurant in Delhi

దేశరాజధాని ఢిల్లీలోని ఓల్డ్‌ రాజేంద్రనగర్‌లో గల ఒక కోచింగ్‌ సెంటర్‌లో జరిగిన ప్రమాదాన్ని మరచిపోకముందే మరో ప్రమాదం చోటుచేసుకుంది. ఢిల్లీలోని ఐఎన్‌ఏ మార్కెట్‌లో ఫాస్ట్‌ఫుడ్‌ దుకాణం, రెస్టారెంట్‌లో మంటలు చెలరేగాయి. స్థానికులంతా భయాందోళనలతో పరుగులు తీశారు. ఈ ఘటన ఈరోజు (సోమవారం) తెల్లవారు జామున చోటుచేసుకుంది.

ప్రస్తుతం ఘటనా స్థలంలో ఎనిమిది అగ్నిమాపక యంత్రాలు  మంటలను నియంత్రించే పనిలో ఉన్నాయి. ఈ ప్రమాదంలో కొందరు గాయపడినట్లు తెలుస్తోంది. ఢిల్లీ ఫైర్ సర్వీస్ అధికారి మనోజ్ మెహ్లావత్ మాట్లాడుతూ నేటి(సోమవారం) ఉదయం 3:20 గంటలకు మంటలు చెలరేగాయని, ఎనిమిది ఫైర్ ఇంజిన్లతో మంటలను ఆర్పుతున్నామని తెలిపారు. చైనీస్ ఫుడ్ కార్నర్‌తో పాటు ఒక రెస్టారెంట్‌లో మంటలు చెలరేగాయని, ఘటన జరిగిన సమయంలో ఫాస్ట్ ఫుడ్ కార్నర్‌లో ఐదారుగురు ఉన్నారని తెలిపారు. వారంతా గాయపడ్డారని అన్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement